Site icon HashtagU Telugu

#Boycott RRR Karnataka: ఆర్ఆర్ఆర్ పై ‘కన్నడ’ ఫ్యాన్స్ ఫైర్!

Rrr

Rrr

దర్శకధీరుడు SSరాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతోంది. రాజమౌళితో పాటు నటులు రాంచరణ్, ఎన్టీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో #BoycottRRRinKarnataka అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం కన్నడ వెర్షన్‌కు తక్కువ ప్రాధాన్యత ఇచ్చినందుకు SS రాజమౌళి RRR బృందంపై కర్ణాటకకు చెందిన నెటిజన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కర్ణాటక అంతటా RRR కన్నడ వెర్షన్‌ చాలా తక్కువ సంఖ్యలో థియేటర్లు కేటాయించడమే ఇందుకు కారణం. కన్నడ వెర్షన్ బదులు తెలుగు వెర్షన్ ఎక్కువ సంఖ్యలో రిలీజ్ చేస్తుండటంతో కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్‌లో ట్రెండింగ్

25న ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం చాలా ఆలస్యం కావాల్సి వచ్చింది. నిన్న (మార్చి 22) నుంచి నెటిజన్లు ట్విట్టర్‌లో #BoycottRRRinKarnatakaని ట్రెండ్ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ కన్నడ డబ్బింగ్ వెర్షన్ కర్నాటకలో పెద్దగా విడుదల కాకపోవడం జనాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే RRR తమిళం, తెలుగు, హిందీ వెర్షన్‌లకు ఎక్కువ స్క్రీన్‌లు కేటాయించడం పట్ల కన్నడ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Exit mobile version