Site icon HashtagU Telugu

Boycott Pushpa 2 : ట్రెండింగ్ లో బాయ్ కాట్ పుష్ప 2..!

Pushpa Us

Pushpa Us

అల్లు అర్జున్ (Allu Arjun,) సుకుమార్ (Sukumar) కాంబోలో వస్తున్న పుష్ప సీరీస్ పార్ట్ 2 పై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయింది. సినిమాకు నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు సినిమా టికెట్ ధరలను భారీగా పెంచారు.

మైత్రి మూవీ మేకర్స్ సొంతంగా ఏపీ, తెలంగాణాలో పుష్ప 2 (Pushpa 2) ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఐతే తెలంగాణా ప్రభుత్వం నుంచి సినిమా టికెట్ రేటుని పెంచే అనుమతి తెచ్చుకున్నారు. డిసెంబర్ 4 సాయంత్రానికి బెనిఫిట్ షో తో పాటుగా రెగ్యులర్ షోస్ కి భారీ రేటు ఫిక్స్ చేశారు. ఐతే ఈ టికెట్ రేటు ఎక్కువ ఉండటం వల్ల సినిమా నిర్మాతల మీద విమర్శలు వస్తున్నాయి.

స్టార్ సినిమాలకు టికెట్ రేటు పెంచడం కామనే కానీ పుష్ప 2 కి దానికి మించి పెంచేశారు. మల్టీప్లెక్స్ లో సినిమా చూడాంటే 800, సింగిల్ స్క్రీన్స్ లో 400 చేశారు. సో ఈ టికెట్ రేటుతో సినిమా చూడాలంటే కామన్ ఆడియన్స్ వల్ల కాదు. దీని వల్లే పుష్ప 2 ని బాయ్ కాట్ (Boycott Pushpa 2) చేయాలని ట్రెండ్ చేస్తున్నారు. నిర్మాతలు తమ బిజినెస్ కోణంలో ఆలోచిస్తున్నారు కానీ సినిమా కామన్ ఆడియన్స్ చూసేలా టికెట్ రేట్లు లేవని పెంచిన టికెట్ రేట్లకు నిర్సనగా బాయ్ కాట్ పుష్ప 2 ని ట్రెండ్ చేస్తున్నారు.

ఐతే మరి సినిమా మీద ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ ఇదే ఇంకాస్త సీరియస్ ఐతే మాత్రం కచ్చితంగా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది.

Also Read : Mokshagna : ఈనెల 5న మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ స్టార్ట్…