Site icon HashtagU Telugu

HHVM : వీరమల్లు ను దెబ్బ తీసేందుకు వైసీపీ కుట్ర

Harihara Veeramallu Boycott

Harihara Veeramallu Boycott

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. జులై 24 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోకగా , నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక కూడా సినిమా పై బజ్ తీసుకువచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోస్ తో పాటు ప్రీమియర్ షోస్ కు అనుమతి , టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదే క్రమంలో వైసీపీ వీరమల్లు పై కుట్ర పన్నుతోంది. ఎలాగైనా దెబ్బ తీసేందుకు సోషల్ మీడియా లో #boycott అనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ఈ సినిమా పై వైసీపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది సోషల్ మీడియా యూజర్లు, అలాగే యాంటీ ఫ్యాన్స్ నుంచి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్‌నే బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తున్నారు.

Krithi Shetty: కృతి శెట్టి మైండ్ బ్లోయింగ్ లుక్స్.. ఫస్ట్ టైం ముద్దుగుమ్మని ఇలా చూడటం

ప్రీ రిలీజ్ వేదికలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. తాను సినిమాకు రెండున్నర గంటల సమయం కేటాయిస్తూ, మిగతా సమయం ప్రభుత్వ పనుల్లో గడిపానని పవన్ చెప్పడం, అలాగే ‘భీమ్లా నాయక్’ విడుదల సమయంలో వైసీపీ ప్రభుత్వం టికెట్ ధరలు తక్కువ చేసి తమను ఇబ్బంది పెట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించడం రాజకీయ విమర్శల కేంద్రంగా మారింది. “రికార్డులు కాదు, గట్స్ మేటర్ ” అని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ అభిమానులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది.

ఇక ఈ వేడుకలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తన ప్రసంగంలో ” నిజ జీవితంలో పవన్ ఓ ఔరంగజేబును ఓడించారు” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో ఆయన నేరుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించినట్లు స్పష్టంగా అనిపించింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్ద ఎత్తున #BoycottHariHaraVeeraMallu అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ ప్రారంభించారు. అంతే కాదు రేపు సినిమా రిలీజ్ తర్వాత కూడా నెగెటివ్ టాక్ ఇవ్వాలని చూస్తున్నారు. దీనికి మెగా అభిమానులు సైతం అదే రేంజ్ లో వైసీపీ పై విరుచుకపడుతున్నారు. మరి రేపు రిలీజ్ సమయంలో వైసీపీ శ్రేణులు ఇంకెన్ని కుట్రలు చేసారో చూడాలి.

Sarfaraz Khan: ఈ స్టార్ క్రికెట‌ర్‌ని గుర్తు ప‌ట్టారా?.. 2 నెల‌ల్లోనే 17 కిలోలు త‌గ్గాడు!