Site icon HashtagU Telugu

Boyapati Sreenu: అఖండ 2పై బోయపాటి ఇంట్రస్టింగ్ కామెంట్స్

Trolls On Skanda Director Boyapati Srinu

Trolls On Skanda Director Boyapati Srinu

Boyapati Sreenu: దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాస్ పల్స్ బాగా తెలుసు కాబట్టి ఆయన సినిమాలు యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో కూడుకున్నవి. తన గత చిత్రం స్కంద విడుదల తర్వాత తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే బోయపాటి తాజాగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన తదుపరి ప్రాజెక్టును ప్రకటిస్తానని ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు.

అఖండ 2 గురించి దర్శకుడు మాట్లాడుతూ సమాజానికి ఏం కావాలో దాన్ని సీక్వెల్ అందిస్తుందన్నారు. కాబట్టి బోయపాటి తదుపరి సినిమా ప్రకటనకు మరికొన్ని నెలలు పడుతుంది. అయితే అభిమానులు బాలయ్యతో బోయపాటి సినిమా ఎప్పుడు ఉంటుందని వెయిట్ చేస్తున్నారు.

కాగా హీరో బాలయ్య ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్నారు. అయితే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత, సినీనటుడు పవన్ పై  వైసీపీ రెండు వేర్వేరు ఫిర్యాదులు చేసింది. వైఎస్సార్సీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి, ఇతర నేతలు వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు.