Surya : తమిళ హీరోతో బోయపాటి.. త్వరలోనే అనౌన్స్ మెంట్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. అసలైతే త్రివిక్రం తో సూర్య

Published By: HashtagU Telugu Desk
Boyapati Srinu Surya Movie

Boyapati Srinu Surya Movie

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. అసలైతే త్రివిక్రం తో సూర్య సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా ఆ కాంబో మాత్రం సెట్ అవ్వట్లేదు. ఆల్రెడీ కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటితో సూర్య సినిమా లైన్ లో ఉంది. సూర్య ప్రస్తుతం కమిటైన సినిమాల తర్వాత చందు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఇక సూర్యతో సినిమా చేసే డైరెక్టర్స్ లిస్ట్ లో బోయపాటి శ్రీను కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది.

బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో స్కంద సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత బాలయ్యతో అఖండ 2 ప్లానింగ్ లో ఉన్నాడు. ఈలోగా సూర్య కూడా బోయపాటి తో కలిసి చేసేందుకు ఆసక్తి చూపించగా ఈమధ్యనే తన దగ్గర ఉన్న ఒక లైన్ ని సూర్యకి వినిపించాడట బోయపాటి. సూర్యకు కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. కోలీవుడ్ విలక్షణ హీరోల్లో హీరో సూర్య ఒకరు. ఒకపక్క ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరోపక్క కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. తమిళ దర్శకుడు హరితో సింగం సీరీస్ లు చేసిన సూర్య బోయపాటితో తెలుగు తమిళ భాషల్లో ఓ ఊర మాస్ బైలింగ్వల్ మూవీ చేయాలని చూస్తున్నారు.

ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది. సినిమా గురించి మిగతా డీటైల్స్ ఎప్పుడు తెలుస్తాయి అన్నది చూడాలి. Surya తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ కు కూడా సూపర్ కిక్ ఇస్తుంది.

Also Read : Sapta Sagaralu Dati : స్ట్రైట్ సినిమా రేంజ్ లో ప్రమోషన్స్..!

  Last Updated: 22 Sep 2023, 06:49 PM IST