Boyapati Srinu స్కంద తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణతో అఖండ 2 చేస్తాడని అనుకున్నారు. కానీ ఆ సినిమాకు ముందు మరో సినిమా చేస్తాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు బోయపాటి. కొన్నాళ్లుగా బోయపాటి తో గీతా ఆర్ట్స్ కాంబో సినిమా అని వార్తలు వచ్చాయి.
We’re now on WhatsApp : Click to Join
నేడు అది అఫీషియల్ గా వెల్లడించారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో బోయపాటి శ్రీను అల్లు అరవింద్ కలిసి ఫోటో దిగారు. మాసివ్ ఫోర్స్ స్ట్రామింగ్ వన్స్ ఎగైన్ అనే పోస్టర్ కూడా వదిలారు.
సో మొత్తానికి బోయపాటితో అల్లు అరవింద్ (Allu Aravind) సినిమా లాక్ అయ్యింది. అయితే ఈ కాంబో సినిమాలో హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తో బోయపాటి శ్రీను ఉంటుందా మళ్లీ సరైనోడు కాంబో రిపీట్ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. హీరో ఎవరన్నది చెప్పకుండా ఈ అనౌన్స్ మెంట్ చాలా డౌట్లను కలిగిస్తుంది.
పుష్ప 2 (Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కలయిక బన్నీ సినిమా కోసమే అని అంటున్నారు. త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా కూడా లైన్ లో ఉంది. మరి ఈ రెండిటిలో బన్నీ ఏ సినిమా ముందు మొదలు పెడతాడన్నది చూడాలి.
Also Read : Ashika Ranganath : సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఆప్షన్.. కన్నడ భామ లక్కీయెస్ట్..!