Akhanda 2 : ఏపీ ఎలక్షన్స్ తర్వాతే అఖండ 2.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి..

అఖండ సీక్వెల్ కూడా ఉంటుందని బోయపాటి గతంలోనే ప్రకటించారు. అభిమానులు కూడా ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Boyapati Srinu gives Clarity on Akhanda 2 with Balakrishna 2

Boyapati Srinu gives Clarity on Akhanda 2 with Balakrishna 2

డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) – బాలకృష్ణ(Balakrishna) కాంబోలో ఇప్పటివరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయి భారీ విజయం సాధించాయి. బోయపాటి బాలయ్య సినిమా అంటే అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అఖండ(Akhanda) భారీ హిట్ అవ్వడమే కాకుండా బాలయ్య కెరీర్ లో మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది.

దీంతో అఖండ సీక్వెల్ కూడా ఉంటుందని బోయపాటి గతంలోనే ప్రకటించారు. అభిమానులు కూడా ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి, ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. మరో పక్క చంద్రబాబు అరెస్ట్, ఏపీ ఎలక్షన్స్ నేపథ్యంలో రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. ఇక బోయపాటి ఇటీవలే స్కంద సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. త్వరలో సూర్య లేదా బన్నీతో సినిమా ఉండబోతుందని సమాచారం.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అఖండ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. బోయపాటి మాట్లాడుతూ.. బాలయ్య బాబుతో అఖండ సీక్వెల్ ఉంటుంది. కానీ దానికి సమయం పడుతుంది. ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. నాకు కూడా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవి పూర్తి అవ్వాలి. అలాగే ఏపీలో పరిస్థితులు, అక్కడి రాజకీయాలతో బాలయ్య బిజీగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్ అయ్యాకే ఈ సినిమా ఉంటుంది. ఇప్పట్లో ఈ సినిమా వర్క్ మొదలవ్వదు. ఏపీ ఎలక్షన్స్, ఆయనకున్న నెక్స్ట్ సినిమాలు అయ్యాకే అఖండ 2 ఉంటుంది అని ప్రకటించారు. దీంతో లేట్ అయినా అఖండ 2 కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు.

 

Also Read : Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి జరిగేది ఏ దేశంలోనో తెలుసా? క్లారిటీ ఇచ్చిన ఉపాసన..

  Last Updated: 08 Oct 2023, 11:13 AM IST