Site icon HashtagU Telugu

EVV – Boyapati : ఆ విషయంలో ఈవీవీని కాపీ కొడుతున్న బోయపాటి..

Boyapati Sreenu Copy Title Cars from EVV Satyanarayana Movies

Boyapati Sreenu Copy Title Cars from EVV Satyanarayana Movies

టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Sreenu) సినిమాల్లో కామన్ గా కనిపించేది.. మాస్ యాక్షన్ మాత్రమే కాదు, టైటిల్ కార్డు సీన్ కూడా ఒకే స్టైల్ లో ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లో బోయపాటి కనిపిస్తూ.. రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్ అని చెప్పడంతో టైటిల్ కార్డు పడి మూవీ మొదలవుతుంది. అయితే ఈ టైటిల్ కార్డు ఐడియాని బోయపాటి.. సీనియర్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ(EVV Satyanarayana) నుంచి కాపీ కొట్టారంటా. ఈవీవీ తన మొదటి సినిమా కోసం ఉపయోగించిన ఐడియాని బోయపాటి తన ప్రతి సినిమా కోసం వాడేసుకుంటున్నారు.

ఈవీవీ సత్యనారాయణ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘చెవిలోపువ్వు’. ఆ టైటిల్ కార్డులో ఈవీవీ యాక్షన్ చెప్పడానికి బదులు కట్ చెబుతారు. ఆయన అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే.. మొదటి సినిమా అవ్వడంతో అనుభవం లేక ఏమన్నా తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పొరపాటులను క్షమించి తనని ఆశీర్వదించండి అంటూ ప్రేక్షకులను కోరుతూ ఈవీవీ టైటిల్ కార్డు చేశారు. ఆ ఐడియానే బోయపాటి ఇప్పుడు తన సినిమాలకు సీరియస్ గా ఉపయోగించేసుకుంటున్నారు.

కాగా ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో ఇలాంటి క్రేజీ ఐడియాలతో చాలా టైటిల్ కార్డ్స్ వచ్చాయి. అప్పటిలో ఈవీవీ చిత్రాల టైటిల్ కార్డ్స్ కి ఒక ప్రత్యేకత ఉండేది. నటీనటులు, టెక్నీషియన్స్ పేరులు వేయడానికికి బదులు వారితోనే వారి పేర్లు చెప్పించడం, పేరడీ పద్ధతిలో టైటిల్స్ వేయడం.. ఆడియన్స్ ని ఆకట్టుకునేవి. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఈ టైటిల్ కార్డ్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి.

ఈవీవీ టైటిల్ కార్డు పద్దతిని ఇప్పటి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా కొన్నాళ్ళు అనుసరించారు. నాన్నకు ప్రేమతో సినిమా వరకు సుకుమార్.. తన మూవీ టైటిల్ కార్డ్స్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తూ వచ్చారు. సినిమా కాన్సెప్ట్ ని ఆ టైటిల్ కార్డులో చూపించేవారు. కానీ రంగస్థలం, పుష్పలో ఆ స్టైల్ ఆఫ్ టైటిల్ కార్డు మిస్ అయ్యింది.

 

Also Read : Rajinikanth: రజనీకాంత్ హిట్ చిత్రం ముత్తు రీరిలీజ్, ఫ్యాన్స్ కు పండుగే!