Samantha Boxoffice: సమంత బాక్సాఫీస్ స్టామినా.. తొలిరోజే ‘యశోద’కు 3 కోట్లు

టాలీవుడ్ బ్యూటీ సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’ గత వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద మరీ హైప్

  • Written By:
  • Updated On - November 14, 2022 / 05:49 PM IST

టాలీవుడ్ బ్యూటీ సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’ గత వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద మరీ హైప్ ఏమీ లేదు. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకంగా భావించారు. కానీ ‘యశోద’ డివైడ్ టాక్‌తో మొదలైంది. కాన్సెప్ట్ బాగున్నా, కొత్తగా అనిపించినా.. ఆశించినంత ఆసక్తికరంగా దాన్ని ప్రెజెంట్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.  ‘యశోద’ ఏమాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందో అనుకున్నారు.

కానీ ఇక్కడే సమంత బాక్సాఫీస్ స్టామినా అక్కరకు వచ్చింది. తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.3 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది సమంత. నాగ్ సినిమా ‘ది ఘోస్ట్’, నాగచైతన్య మూవీ ‘థాంక్యూ’ కంటే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ఎక్కువ కావడం విశేషం. ఐతే టాక్ బాగా లేని సినిమాకు వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అవుతాయి కానీ.. ‘యశోద’కు మాత్రం కలెక్షన్లు కాస్త నిలకడగానే ఉన్నాయి. 2, 3 రోజుల్లోనూ తొలి రోజుకు దీటుగా వసూళ్లు రాబట్టిందీ చిత్రం. తెలుగు రాష్ట్రాల వరకు ‘యశోద’ షేర్ రూ.5 కోట్ల మార్కును దాటింది. యుఎస్‌లో ఈ చిత్రం 4 లక్షల డాలర్ల మార్కుకు చేరువగా వెళ్తోంది. బాక్సాఫీస్ చాలా డల్లుగా ఉన్న టైంలో ఇలాంటి టాక్‌తో ఈ వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు.