Site icon HashtagU Telugu

Bougainvillea Movie : సోనీ LIVలో ప్రీమియర్‌గా బోగెన్‌విల్లా చిత్రం

Bougainvillea premiered on Sony LIV

Bougainvillea premiered on Sony LIV

Bougainvillea Movie :  మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే సైకలాజికల్ థ్రిల్లర్ కోసం చూస్తున్నారా? అమల్ నీరద్ దర్శకత్వం వహించిన మరియు లాజో జోస్‌తో కలిసి రచించిన 2024 మలయాళ భాషా చిత్రం బోగెన్‌విల్లా డిసెంబర్ 13న సోనీ LIVలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. అమల్ నీరద్ ప్రొడక్షన్స్, ఉదయ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో జ్యోతిర్మయి, కుంచాకో బోబన్, ఫహద్ ఫాసిల్ సహా వీణా నందకుమార్, స్రింద, షరాఫ్ యు ధీన్ కీలక పాత్రల్లో నటించారు. లాజో జోస్ 2019 లో రచించిన నవల రుతింటే లోకం ఆధారంగా రూపుదిద్దుకున్న బోగెన్‌ విల్లా 11 సంవత్సరాల విరామం తర్వాత అంతా ఎదురు చూస్తున్న విధంగా జ్యోతిర్మయి వెండితెరపైకి తిరిగి రావడాన్ని సూచిస్తుంది. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మీ వాచ్‌లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉండటానికి ఇక్కడ ఐదు కారణాలు ఉన్నాయి:

మిమ్మల్ని కట్టిపడేసే కథ..

బౌగెన్‌విల్లె చమత్కారమైన కథనం మానవ భావోద్వేగాలు, సంబంధాలు, సంఘర్షణల పొరలను అన్వేషిస్తుంది. ఈ చిత్రం మలయాళ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేలా పట్టు సడలని, అనూహ్యమైన కథనాన్ని అందించి, వీక్షకులను కుర్చీ అంచుల్లోకి రప్పించే థ్రిల్లర్ అనుభవంతో వాస్తవికతను మిళితం చేసింది.

జ్యోతిర్మయి విజయవంతమైన పునరాగమనం..

ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం తర్వాత తిరిగి వస్తున్న జ్యోతిర్మయి మానసికంగా దుర్బలమైన, భావోద్వేగ పరంగా హింసను అనుభవించిన మహిళ రీతూగా మెస్మరైజ్ చేస్తుంది. ఆమె విలక్షణ నటన హైలైట్‌గా నిలిచింది. కుంచాకో బోబన్ సైతం డా. రాయిస్ పాత్రను అదే విధంగా పోషించారు. అది అటు మనోజ్ఞతను, ఇటు భయాన్ని కలిగించే పాత్ర. మరో వైపున ఫహద్ ఫాసిల్ దృఢ నిశ్చయం కలిగిన పోలీసుగా తనదైన సిగ్నేచర్ బ్రిలియన్స్‌ను జోడించాడు. చిత్రంలోని పాత్రలన్నిటికీ కుట్ర పొరలను జోడించాడు.

అమల్ నీరద్ విజనరీ డైరెక్షన్..

తన విలక్షణమైన విజువల్ స్టైల్ కు ప్రసిద్ధి చెందిన అమల్ నీరద్ ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ఒక కొత్త విభాగంలోకి అడుగు పెట్టాడు. మాస్టర్‌ఫుల్ డైరెక్షన్, అనెంద్ సి. చంద్రన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, వివేక్ హర్షన్ తిరుగులేని ఎడిటింగ్‌తో బోగెన్‌విల్లా ఒక సాంకేతిక అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది వీక్షకులను ఒక విధమైన ఉద్రిక్త వాతావరణంలో ముంచెత్తుతుంది.

ప్రతిధ్వనించే సౌండ్‌ట్రాక్..

సుశిన్ శ్యామ్ యొక్క ఉద్వేగభరితమైన స్కోర్ చిత్రం మూడ్‌ను తీవ్రతరం చేస్తుంది. కథనానికి సజావుగా అల్లుకుపోతుంది. పరిసర ధ్వనుల వినూత్న ప్రయోగం నుండి వెంటాడే ఎండ్-క్రెడిట్స్ ట్రాక్ స్తుతి వరకు అది అలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ మ్యూజిక్ కథనానికి బలం అందించడం మాత్రమే కాకుండా ఎలివేట్ చేస్తుంది, వీక్షకులపై శాశ్వత ముద్రను వేస్తుంది.

మీకు గుర్తుండిపోయే క్లైమాక్స్..

సినిమా ముగింపు ఎంతో బోల్డ్‌గా, ఆలోచింపజేసేదిలా ఉంటుంది. క్రెడిట్స్ రోల్ తర్వాత కూడా చాలా సేపటి దాకా తర్వాత వీక్షకులు దీంతోనే మమేకమై ఉంటారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, దీని అనూహ్యత బోగెన్‌విల్లాను మిగితా వాటి నుంచి వేరుచేసే సాహసోపేతమైన కథనాన్ని నొక్కి చెబుతుంది. డిసెంబర్ 13ను మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి. Sony LIVలో బోగెన్‌విల్లా ప్రపంచంలో మునిగిపోండి. ఆకట్టుకునే నటన, అద్భుతమైన విజువల్స్ మరియు కథనంతో వస్తుంది.

Read Also: Sora and Indians : ‘సోరా’పై భారతీయ ముద్ర.. భారత కళాకారులు, మూవీ డైరెక్టర్స్ ఫీడ్‌బ్యాక్