Site icon HashtagU Telugu

Pathaan Bookings: షారుఖ్ ఖాన్ క్రేజ్.. ‘పఠాన్’ దెబ్బకు బుక్ మై షో క్రాష్!

Pathaan

Pathaan

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah rukh khan) తెరపై కనిపించి చాలా రోజులవుతోంది. తాజాగా ఆయన పఠాన్ (Pathaan) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆయన చివరి చిత్రం జీరో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే, ఆయన ఇప్పుడు రాబోయే పఠాన్ (Pathaan) చిత్రంతో సందడి చేయడానికి రెడీగా ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది.

YRF స్టూడియో 2D, 2D IMAX, 4DX స్క్రీన్‌లలో ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ చిత్రానికి ప్రీ-బుకింగ్ స్టార్ట్ అయ్యింది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాలు ఇప్పటికే టిక్కెట్ల బుకింగ్ మొదలయ్యాయి. బుక్సింగ్ (Bookings) ఓపెన్ చేసిన నిమిషాల్లోనే టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు, ట్రైలర్ విడుదలైనప్పుడు సైట్‌లో భారీ ట్రాఫిక్ కారణంగా Youtube సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఇప్పుడు, అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభించిన తర్వాత టికెట్ సైట్ బుక్‌మైషో కూడా క్రాష్ అయింది.

బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాల ఫేం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, షారుఖ్ ఖాన్ టైటిల్ క్యారెక్టర్‌తో స్పై థ్రిల్లర్‌ను రూపొందించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహంతో పాటు దీపికా పదుకొనే కూడా ప్రధాన పాత్రలో నటించారు. పఠాన్ (Pathaan) జనవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడైతే విడుదలైందో, అప్పట్నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బేషరమ్ సాంగ్ కూడా మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ పాటలో దీపికా బికినీ షో (Bikini Show), షారుఖ్ ఖాన్ బాడీ ఫ్యాన్స్ ను ఫిదా చేశాయి.

Also Read: Chiranjeevi Demands: భోళా శంకర్‌ కు ‘చిరంజీవి’ కండీషన్స్