Boney Kapoor: మోడల్ నడుముపై చేయి వేసిన బోని కపూర్.. ఈ వయసులో అవసరమా అంటూ ట్రోల్స్?

ప్రముఖ దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనందరికీ తెలిసిందే. శ్రీదేవి ఎన్నో సినిమాలలో నటించి

  • Written By:
  • Publish Date - April 4, 2023 / 07:21 PM IST

ప్రముఖ దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి గురించి మనందరికీ తెలిసిందే. శ్రీదేవి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. కాగా శ్రీదేవి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా వారు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అర్జున్ కపూర్ లు. ఇది ఇలా ఉంటే స్టార్ ప్రొడ్యూసర్ అయిన బోని కపూర్‌ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు బోని కపూర్‌.

ఇది ఇలా ఉంటే తాజాగా బోని కపూర్‌ చేసిన పనికి నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ నీతా ముఖేశ్‌ అంబానీ సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభోత్సవం తాజాగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ముంబైలో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, వరుణ్‌ ధావన్‌ తో పాటు ప్రముఖ నిర్మాత బోని కపూర్‌ కూడా హాజరయ్యారు. వీరితోపాటు రాజకీయ నాయకులు అలాగే క్రీడా ప్రముఖులు కూడా హాజరయ్యారు.

 

అలాగే హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మోడల్‌ జిగి హడిద్‌ కూడా ఈ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసింది. అక్కడ బోని కపూర్‌ కనిపించడంతో దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించింది. తరువాత ఇద్దరు కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అయితే ఫోటో దిగే క్రమంలో బోని కపూర్‌ జిగి హడిద్‌ నడుము పై చేతులు వేశారు. అయితే ఆయన మాత్రం క్యాజువల్‌గానే చేతులు వేసి ఫోటో దిగారు. జిగి సైతం అలానే భావించి లైట్‌ తీసుకుంది. కానీ నెటిజన్స్‌ మాత్రం ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ ఫోటోని షేర్‌ చేసూ బోనీ కపూర్‌ని దూషిస్తున్నారు. అంతేకాకుండా ఈ వయసులో ఇలాంటివి అవసరమా అంటూ బోని కపూర్‌ పై మండిపడుతున్నారు.