Bomman & Belli: ఆస్కార్ అవార్డుతో బొమ్మన్ దంపతులు ఫోజులు.. నెట్టింట్లో ఫొటో వైరల్!

ది ఎలిఫెంట్ విస్పరర్స్" అనే డాక్యుమెంటరీలో ఏనుగు సంరక్షకులుగా బొమ్మన్, బెల్లి దంపతులు నటించిన విషయం తెలిసిందే

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 03 23 At 12.55.05 Pm

Whatsapp Image 2023 03 23 At 12.55.05 Pm

ఆస్కార్స్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కూడా సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సమానంగా ఈ మూవీకి అంతటా ప్రశంసలు దక్కాయి. అయితే “ది ఎలిఫెంట్ విస్పరర్స్” అనే డాక్యుమెంటరీలో ఏనుగు సంరక్షకులుగా బొమ్మన్, బెల్లి దంపతులు నటించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో ఎంతో సహజంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు.

తాజాగా ఈ జంట ఆస్కార్ ట్రోఫీతో ఫోజులిచ్చారు. మొదటిసారి ప్రతిష్టాత్మకమైన అవార్డును చేతుల్లోకి తీసుకొని మురిసిపోయారు. తామే అవార్డును గెలిచాం అనేలా నవ్వులు చిందించారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మానవులు, ఏనుగుల మధ్య సంబంధాన్ని, శాంతియుత సహజీవనాన్ని అన్వేషించే డాక్యుమెంటరీ చాలామందిని ఆకట్టుకుంది. దర్శకుడు కార్తికీ గోన్సాల్వేస్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్కార్ అవార్డుతో  చిరునవ్వుతో చిందిస్తున్న ఈ జంట ఫొటోను షేర్ చేశారు. దీంతో ప్రేక్షకులతో పాటు నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఈ డాక్యుమెంటరీలో ఎనుగు సంరక్షులుగా నటించిన బొమ్మన్, బెల్లి చిత్రం విజయంలో భాగస్వాములు అయ్యారు. సహజ నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ జంటను నెటిజన్స్ ఏ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

తమిళనాడు నీలగిరి జిల్లాలో బొమ్మన్, బెల్లి దంపతులు తప్పిపోయిన ఓ ఏనుగును చెరదీసి తమ జీవితంలో భాగంగా దాన్ని పెంచుతున్నారు. ఆ ఏనుగుతో వారికున్న అనుబంధాన్ని, ప్రేమను ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే షార్ట్ ఫిల్మ్ రూపంలో తెరకెక్కించారు కార్తికి. ఉత్తమ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలిచి 95వ అకాడమీ అవార్డుల్లో చరిత్ర సృష్టించారు.

 

  Last Updated: 23 Mar 2023, 01:29 PM IST