Bollywood Stars Bodyguard: బాలీవుడ్ నటులు తమ భద్రతపై (Bollywood Stars Bodyguard) ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. ఈ జాబితాలో బాలీవుడు స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ నుండి షారుఖ్ ఖాన్ వరకు ప్రతి ఒక్కరికీ వారి వ్యక్తిగత బాడీగార్డ్ ఉన్నారు. అయితే సల్మాన్ బాడీగార్డ్ షేరా, షారుక్ బాడీగార్డ్ రవి సింగ్ గురించి ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. ఇటీవలి పోడ్‌కాస్ట్‌లో యూసుఫ్ ఇబ్రహీం అనే వ్యక్తి ఈ ఇద్దరి సంపాదన గురించి చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు.
షారుక్ బాడీ గార్డ్ రవి సింగ్ ఆదాయం ఎంతంటే?
యూసుఫ్ ఇబ్రహీం ఒక ప్రసిద్ధ భద్రతా సలహాదారు. అలియా భట్, వరుణ్ ధావన్‌తో సహా చాలా మంది A-గ్రేడ్ సెలబ్రిటీలకు వారి కెరీర్ ప్రారంభ రోజుల నుండి భద్రత కల్పిస్తున్నాడు. ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో ప్రముఖ టీవీ హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్, షారుఖ్ బాడీగార్డ్ రవి సింగ్ వార్షిక వేతనం రూ. 2.7 కోట్లు తీసుకుంటారా అని యూసఫ్ ఇబ్రహీంను అడిగాడు. ఇబ్రహీం దానికి సమాధానం ఇస్తూ.. అంత సాధ్యం కాదు అన్నారు. అంటే యూసఫ్ ఇబ్రహీం ప్రకారం రవి సింగ్ జీతంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు.
Also Read: Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షేరా ఆదాయం?
మరోవైపు సల్మాన్ బాడీగార్డ్ షేరా సంపాదన ఏటా రూ. 2 కోట్లు అని అడిగినప్పుడు యూసఫ్ వేరే సమాధానం చెప్పాడు. షేరాకు సొంత సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉందని చెప్పారు. ఇది కాకుండా అతను చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టాడు. కాబట్టి అతను రూ. 2 కోట్లు సంపాదించే అవకాశం ఉందన్నారు. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. అతను దాదాపు రెండు దశాబ్దాలుగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్‌గా ఉంటున్నాడు. టైగర్ సెక్యూరిటీ పేరుతో షేరా తన ఏజెన్సీని నడుపుతున్నాడు.
అక్షయ్ కుమార్ బాడీగార్డ్ శ్రేయ్ తేలే ఆదాయం?
అక్షయ్ కుమార్ బాడీగార్డ్ శ్రేయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై యూసుఫ్ ఇబ్రహీం మాట్లాడుతూ.. అతని వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. నెలవారీగా చూస్తే రూ.10 నుంచి 12 లక్షలు కంటే ఎక్కువ ఇవ్వకపోవచ్చు. బాడీగార్డ్ జీతం ఎంత? సదరు హీరో నెలలో ఎన్ని రోజులు పని చేస్తారు? మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.