Prayag Raj : బాలీవుడ్ స్టార్ రైటర్ కన్నుమూత.. ఎన్నో సూపర్ హిట్స్.. బాలీవుడ్ నివాళులు..

తాజాగా బాలీవుడ్(Bollywood) లో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ రచయిత ప్రయాగ్ రాజ్ కన్నుమూశారు.

Published By: HashtagU Telugu Desk
Bollywood Star Writer Prayag Raj Passed away with Health Issues

Bollywood Star Writer Prayag Raj Passed away with Health Issues

ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సినీ ప్రముఖులు మరణిస్తూ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపుతున్నారు. తాజాగా బాలీవుడ్(Bollywood) లో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ రచయిత ప్రయాగ్ రాజ్ కన్నుమూశారు.

దాదాపు 50 ఏళ్ళ క్రితమే సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రయాగ్ రాజ్(Prayag Raj) రచయితగా కూలి, అమర్ అక్బర్ అంథోని, మర్డ్, గెరాప్తార్, జమానత్.. ఇలా అనేక సూపర్ హిట్ సినిమాలకు కథ అందించి మాటలు కూడా రాశారు. దాదాపు 100 సినిమాలకు పైగా రచయితగా పనిచేశారు ప్రయాగ్ రాజ్. అమితాబ్, ధర్మేంద్ర, అనిల్ కపూర్.. ఆ కాలం నాటి స్టార్ హీరోలందరితో కలిసి పనిచేశారు.

గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ప్రయాగ్ రాజ్ ఇటీవల పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ నేడు ఉదయం 88 ఏళ్ళ వయసులో మరణించగా ఇవాళ సాయంత్రమే అంత్యక్రియలు కూడా చేసేశారు. ఈ విషయాన్ని ప్రయాగ్ రాజ్ తనయుడు ఆదిత్య మీడియాకు తెలిపారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

 

Also Read : Thuppakki : అక్షయ్ కుమార్ చేయాల్సిన మూవీ విజయ్ చేశాడు.. తరువాత రీమేక్..

  Last Updated: 24 Sep 2023, 09:57 PM IST