Salman Khan: సల్మాన్ సంచలనం.. ఇక సినిమాలకు గుడ్ బై!

'కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ తర్వాత సల్మాన్ కొత్త ప్రాజెక్టుకు సైన్ చేయకపోవడంతో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Salman Khan Rib Injury

Salman Khan Rib Injury

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ (Salman Khan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ (Bollywood) ను ప్రభావితం చేసే నటుడు. ఈ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్, ఘోరంగా నిరాశపర్చింది. రంజాన్ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది.

ఇప్పుడు సల్మాన్ రిటైర్మెంట్ (Movies) గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ తర్వాత సల్మాన్ కొత్త ప్రాజెక్టుకు సైన్ చేయకపోవడంతో అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఇటీవల సల్మాన్‌కి ఆరు కొత్త సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. కానీ సల్మాన్ ఖాన్ ఏ ఒక్క చిత్రాన్ని అంగీకరించలేదని తెలుస్తోంది. అయితే నవంబర్‌లో ‘టైగర్ 3’ విడుదలయ్యే వరకు వేచి ఉంటాడని తెలుస్తోంది. ఆ తర్వాత సినిమాలకు రిటైర్ మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. అయితే కొత్త సినిమాలను ఒప్పుకోకపోవడంతో ఈద్ 2024 సల్మాన్ సినిమా (Salman Khan) సందడి చేయకపోవచ్చు.

మనీష్ శర్మ దర్శకత్వంలో కత్రినా కైఫ్, షారూఖ్ ఖాన్ నటించిన సల్మాన్ రాబోయే ప్రాజెక్ట్ ‘టైగర్ 3’ (Tiger) కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ తనకు ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లను ఎంచుకునే విషయంలో మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుందని స్టార్ ఆశిస్తున్నాడు. ‘దబాంగ్’ నటుడికి ఇటీవల పలు రకాల బెదిరింపులు రావడంతో వార్తల్లో నిలిచాడు. “అభద్రత కంటే భద్రత ఉత్తమం. ఇప్పుడు రోడ్డు మీద సైకిల్ తొక్కడం, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లడం సాధ్యం కాదు. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సల్మాన్ ఖాన్ స్టార్‌డమ్ చెక్కు చెదరలేదు. పై కారణాల వల్ల సల్మాన్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Hyderabad Biryani: బిర్యానీలో బొద్దింక.. రెస్టారెంట్ పై 20 వేల ఫైన్

  Last Updated: 02 May 2023, 02:44 PM IST