Site icon HashtagU Telugu

Salman Congrats Chiru: మై డియర్ చిరు, ఐ లవ్ యూ.. మనం హిట్ కొట్టాం!

Chiru And Salman

Chiru And Salman

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. టాలీవుడ్ కు గుడ్ ఫాదర్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. గాడ్ ఫాదర్ కు అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ‘మై డియర్ చిరు గారూ, ఐ లవ్ యూ’ అంటూ సల్మాన్ స్పందించాడు.

“గాడ్ ఫాదర్ బాగా పనిచేస్తున్నారని నేను విన్నాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చిరు గారు క్యూంకీ ఇస్స్ దేశ్ ఔర్ ఇస్స్ దేశ్ కీ జాంతా మై హై బదా దమ్ అని మీకు తెలుసు. (ఎందుకంటే ఈ దేశం, పౌరులు చాలా శక్తివంతులు) అంటూ సల్మాన్ క్యాప్షన్ ఇచ్చారు. మోహన్ రాజా డైరెక్షన్ లో రామ్ చరణ్, R. B. చౌదరి, N. V. ప్రసాద్‌లు సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్‌పై గాడ్ ఫాదర్ ను నిర్మించారు. గాడ్ ఫాదర్ రిమేక్ లూఫిసర్ సినిమా 2019 మలయాళంలో విడుదలైంది. ఒరిజినల్ మూవీ అందర్నీ ఆకట్టుకుంది.