Site icon HashtagU Telugu

Mithun Chakraborty : స్టార్ నటుడి పర్స్ కొట్టేసిన దొంగలు.. అడిగినా ఇవ్వలేదు..

Bollywood Star Mithun Chakraborty Purse Stolen in Election Campaign

Mithun Chakraborthy

Mithun Chakraborty : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ప్రస్తుతం అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా మిథున్ చక్రవర్తికి ప్రకటించింది. మిథున్ చక్రవర్తి ఇప్పుడు ప్రభాస్ – హను రాఘవపూడి సినిమాలో కూడా నటిస్తున్నారు.

తాజాగా మిథున్ చక్రవర్తి ఝార్ఖండ్ లో ఓ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బీజేపీ అభ్యర్థి తరపున మిథున్ చక్రవర్తి ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈయన పర్సుని ఎవరో దొంగలు కొట్టేసారు. ఆయన పర్స్ పోయిన విషయం గ్రహించి అక్కడి నిర్వాహకులకు చెప్పారు. వాళ్ళు చాలా సేపు మైక్ లో మిథున్ చక్రవర్తి పర్స్ తిరిగి ఇమ్మని అడిగినా ఎవ్వరూ తెచ్చివ్వలేదు. దీంతో మిథున్ చక్రవర్తి అసహనంతో సభ నుంచి వెళ్లిపోయారు.

అలాంటి రాజకీయ ప్రచార సభలో ఏకంగా స్టార్ నటుడి పర్స్ కొట్టేసిన దొంగ ఎవరో అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

Also Read : Mr Bachchan : మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ పై నిర్మాత కామెంట్స్.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం..