Saroj Khan Biopic : బాలీవుడ్ లో మరో బయోపిక్.. ఈ సారి స్టార్ లేడీ కొరియోగ్రాఫర్ కథ..

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్(Choreographer), దివంగత డ్యాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్(Saroj Khan) జీవిత కథని తెరకెక్కించబోతున్నట్టు నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Bollywood Star Lady Choreographer Saroj Khan Biopic in Progress Production in T Series

Bollywood Star Lady Choreographer Saroj Khan Biopic in Progress Production in T Series

ఇటీవల బయోపిక్స్(Biopic) నిర్మాణం పెరిగింది. అన్ని పరిశ్రమలలోని బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్(Bollywood) లో అయితే ఈ బయోపిక్స్ హంగామా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే అనేక బయోపిక్స్ బాలీవుడ్ నుంచి రాగా త్వరలో మరో బయోపిక్ రానుంది.

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్(Choreographer), దివంగత డ్యాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్(Saroj Khan) జీవిత కథని తెరకెక్కించబోతున్నట్టు నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా ప్రకటించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టి సిరీస్ ఈ బయోపిక్ తెరకెక్కించనుంది. దర్శకుడు హన్సల్ మెహతా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టు, త్వరలోనే షూటింగ్ కి వెళ్తామని, సరోజ్ ఖాన్ క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల నాగ్‌పాల్. ముంబైకి చెందిన ఈమె ఒక సైడ్ డ్యాన్సర్ గా బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి అనంతరం కొరియోగ్రాఫర్ గా మారింది. దాదాపు బాలీవుడ్ లో 200 లకు పైగా సినిమాలకు పనిచేసింది. బాలీవుడ్ లోని ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి ఈమె డ్యాన్స్ కంపోజ్ చేసింది. ఇండియాని ఊపేసిన మాధురి దీక్షిత్ ఏక్ దో తీన్, ఐశ్వర్య ఖాన్ రేలా రే రేలా.. సాంగ్స్ కూడా ఈమె కంపోజ్ చేసింది.

ఇలాంటి ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ని సరోజ్ ఖాన్ కంపోజ్ చేసి అవార్డులు కూడా గెలుచుకుంది. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఏకంగా మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకుంది. తెలుగులో కూడా పలు సినిమాలకు పనిచేసిన సరోజ్ ఖాన్ చిరంజీవి చూడాలని ఉంది సినిమాకు నంది అవార్డు కూడా గెలుచుకుంది. పలు టీవీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరించింది. 71 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించారు సరోజ్ ఖాన్. మరి సరోజ్ ఖాన్ బయోపిక్ ఎప్పుడు వస్తుందో, ఆమె పాత్రలో ఏ హీరోయిన్ కనిపిస్తుందో, ఏ రేంజ్ లో ఈ బయోపిక్ ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.

 

Also Read : Chota K Naidu : తెలుగులో వేరే పరిశ్రమల కెమెరామెన్స్ ని తెచ్చుకోవడంపై.. ఛోటా కె నాయుడు సంచలన కామెంట్స్

  Last Updated: 14 Sep 2023, 08:09 AM IST