Site icon HashtagU Telugu

RC16 : రాం చరణ్ బుచ్చి బాబు సినిమాలో బాలీవుడ్ స్టార్.. ఏకంగా ఆ యాక్టర్ ని దించేస్తున్నారు..!

Ram Charan Rejected Kollywood Director Picked that Movie

Ram Charan Rejected Kollywood Director Picked that Movie

RC16 ఉప్పెన సినిమాతో ఫస్ట్ అటెంప్ట్ తోనే సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా ఏకంగా గ్లోబల్ స్టార్ తో ఫిక్స్ చేసుకున్నాడు. రాం చరణ్ 16వ సినిమాగా బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. అయితే దేవర బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

ఇదిలాఉంటే ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ బాబీ డియో, ఇమ్రాన్ హష్మి తెలుగు సినిమాల్లో నటిస్తుండగా సంజయ్ దత్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు జాన్ అబ్రహం కూడా తెలుగు తెర మీద కనిపించనున్నారు.

చరణ్ తో ఢీ కొట్టేందుకు జాన్ అబ్రహం రెడీ అవుతున్నాడు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమా విషయంలో బుచ్చి బాబు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. సినిమా కోసం చరణ్ మేకోవర్ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని అంటున్నారు. చరణ్ ప్రస్తుతం గేం చేంజర్ సినిమా చేస్తుండగా ఆ సినిమా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Eagle First Day Collections : రవితేజ ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి..?