Site icon HashtagU Telugu

Hrithik Roshan Video: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్.. హ్యాట్సాప్ అంటున్న నెటిజన్స్!

Hritik

Hritik

‘విక్రమ్ వేద’ సినిమాతో బిజీగా ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. ఇటీవల ఒక కార్యక్రమంలో అభిమానుల పాదాలను తాకి నెటిజన్స్ మనసులను గెలుచుకున్నాడు. ఓ ఫిట్‌నెస్ ఈవెంట్  కు హృతిక్ రోషన్ అటెండ్ అయ్యాడు. ఆ సమయంలో ఓ అభిమాని హృతిక్‌కి అభివాదం చేయాలని ఆసక్తి చూపాడు. వేదికపైకి వచ్చి ఫెవరేట్ హీరో పాదాలను తాకాడు. వెంటనే హృతిక్ కూడా అభిమాని పాదాలను తాకి ఆశ్చర్యపర్చాడు. అనంతరం ఇద్దరు కలిసి సెల్ఫీ దిగారు. సోషల్ మీడియాలో ఆ అభిమాని రియాక్ట్ అవుతూ.. “సో స్వీట్ ఆఫ్ యు @hrithikroshan” అని క్యాప్సన్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండటంతో “చాలా మంచి సూపర్ స్టార్”, “అత్యంత వినయంగా ఉండే సూపర్ స్టార్” అని అభిమానులు హృతిక్ రోషన్ ను పొగిడేస్తున్నారు. టైగర్ ష్రాఫ్‌తో కలిసి హృతిక్ రోషన్ నటించిన చివరి చిత్రం ‘వార్’ బ్లాక్ బస్టర్ అయింది. విజయ్ సేతుపతి-ఆర్‌కి రీమేక్ అయిన ‘విక్రమ్ వేద’తో మనముందుకు రాబోతున్నాడు హృతిక్ రోషన్.

Exit mobile version