Yami Gautam: మరొకసారి ప్రెగ్నెంట్ అయినా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన

Published By: HashtagU Telugu Desk
Mixcollage 10 Feb 2024 08 01 Am 5772

Mixcollage 10 Feb 2024 08 01 Am 5772

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె పలు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అయితే ఒకరకంగా చెప్పాలి అంటే యామీ గౌతమ్ సినిమాల ద్వారా కంటే కమర్షియల్ యాడ్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ భారీగా పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే యామి గౌతమ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ బ్యూటీ అంటే చాలు ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. కదా ఈమె తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ సినిమాలలో నటించి అక్కడ బాగా పాపులారిటీ సంపాదించుకుంది యామి గౌతమ్. ఇకపోతే యామీ ప్రధాన పాత్రలో వచ్చిన ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌ అనే సినిమా టైమ్‌లో ఆదిత్య ధర్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ మూవీ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీ అనంతరం వీరిద్దరూ 2021 లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కాగా రీసెంట్‌గా ఆదిత్య ధర్ తన రాబోయే చిత్రం ఆర్టికల్ 370 ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో యామీ గౌతమ్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో యామీ గౌతమ్ తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు.

ఓ వైపు సినిమా షూటింగ్, మరోవైపు ప్రెగ్నెన్సీ.. ఆ సమయంలో తను ఎదుర్కున్న సవాళ్లను షేర్ చేసుకున్నారు. తన భర్త ప్రాజెక్టులో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉందని చెబుతూ తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న భర్త ఆదిత్యధర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఆర్టికల్ 370 మూవీకి వ్యతిరేకంగా వస్తున్న ఈ మూవీని ఆదిత్య సుహాస్ జంభలే డైరెక్ట్ చేసారు. యామీ గౌతమ్, ప్రియమణి ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.

  Last Updated: 10 Feb 2024, 08:01 AM IST