Site icon HashtagU Telugu

Emraan Hashmi: బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు.. వాళ్ళు సినిమాల్లో డబ్బులు వేస్ట్ చేస్తారంటూ!

Mixcollage 14 Feb 2024 09 45 Am 5033

Mixcollage 14 Feb 2024 09 45 Am 5033

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో బోల్డ్ సినిమాలకు ఈయన పెట్టింది పేరు. ఎక్కువ శాతం అలాంటి సినిమాలలో నటించి బాగా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో లిప్ కిస్ రొమాన్స్ సీన్ లు లేకుండా ఇమ్రాన్ హష్మీ సినిమా ఉండేది కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒకప్పుడు అలాంటి పాత్రలో ఎక్కువగా నటించిన ఇమ్రాన్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి కొత్త తరహా పాత్రలలో నటిస్తున్నారు. మొదటిసారి ఇమ్రాన్ హష్మీ తెలుగులో పవన్ కళ్యాణ్ OG సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఇమ్రాన్ విలన్ పాత్రలో కనిపించబోతాడని సమాచారం. ఆల్రెడీ ఇమ్రాన్ కి సంబంధించి చాలా వరకు OG షూట్ అయిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. సౌత్ సినిమా చేస్తున్నందుకు సౌత్ – బాలీవుడ్ మధ్య తేడా ఏంటి యాంకర్ ప్రశ్నించగా.. దీనికి ఇమ్రాన్ హష్మీ స్పందిస్తూ.. సౌత్ ఫిలిం మేకర్స్ బాలీవుడ్ వాళ్ళ కంటే చాలా క్రమశిక్షణగా ఉంటారు. బాలీవుడ్ లో సినిమా విషయాల్లో డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. కొన్ని సార్లు అవసరం లేని చోట కూడా ఖర్చు పెడతారు.

కానీ సౌత్ లో ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఖర్చు చేసిన డబ్బులు సినిమా రూపంలో కనిపిస్తాయి. VFX, పాత్ బ్రేకింగ్ కథల విషయంలో సౌత్ దర్శకులు మనకంటే ముందు ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇమ్రాన్ హష్మీ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పలువురు ఇండియన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అవును అది నిజమే అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఇమ్రాన్ బాలీవుడ్ నటుడు అయి ఉంది ఇలా టాలీవుడ్ గురించి పాజిటివ్గా మాట్లాడుతూ బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.