Site icon HashtagU Telugu

Ramayanam Sai Pallavi : బాలీవుడ్ రామాయణం కోసం సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్..!

Sai Pallavi in Venu Yellamma

Sai Pallavi in Venu Yellamma

Ramayanam Sai Pallavi సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఒక సినిమాకు సైన్ చేసింది అంటే చాలు ఆ సినిమాపై విపరీతమైన బజ్ పెరిగిపోతుంది. సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఆ సినిమా పక్కా హిట్ అనేలా ఆమె క్రేజ్ తెచ్చుకుంది. తన అభిమానులు తన మీద పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంది సాయి పల్లవి. అందుకే ఆమె వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చేయకుండా తనకు నచ్చిన కథలను మాత్రమే చేస్తూ వస్తుంది.

తెలుగులో సాయి పల్లవి క్రేజ్ గురించి తెలిసిందే. అందుకే ఆమెను సంప్రదించే దర్శకులు కూడా తనను ఇంప్రెస్ చేసే కథ అయితేనే ఆమెకు చెబుతుంటారు. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో తండేల్ సినిమా చేస్తుంది సాయి పల్లవి. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది.

ఈ సినిమా తో పాటుగా బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది సాయి పల్లవి. ముఖ్యంగా హిందీ రామాయణంలో సీత పాత్రలో మెప్పించనుంది సాయి పల్లవి. అయితే ఈ సినిమాలో నటించేందుకు తను రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ డిమాండ్ చేస్తుందట సాయి పల్లవి. మామూలుగా అయితే సినిమాకు 3, 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే సాయి పల్లవి రామాయణం కోసం ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉండగా సినిమాకు 10 కోట్ల దాకా అడిగిందని టాక్.

Also Read : Nani : నాని దృష్టిలో పడ్డ స్టార్ కమెడియన్.. ఇద్దరు కలిసి సూపర్ ప్లాన్..!

బాలీవుడ్ రామాయణం సినిమాను వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్ (Ranbhir Kapoor) రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తుంది. నితీష్ తివారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది. సాయి పల్లవికే 10 కోట్లు ఇస్తున్నారు అంటే రణ్ బీర్ కి 60 నుంచి 80 కోట్ల దాకా ఉంటుందని టాక్. మొత్తానికి రామాయణం రెమ్యునరేషన్స్ తోనే సినిమా బడ్జెట్ పెంచేస్తున్నారని చెప్పొచ్చు.

ఈ సినిమా కోసం సౌత్ సినీ పరిశ్రమ నుంచి కూడా నటీనటులను ఎంపిక చేయనున్నారు. లక్ష్మనుడిగా తెలుగు యువ హీరో నవీన్ పొలిశెట్టిని తీసుకోవాలని చూస్తున్నారట. అతను ఓకే అంటే అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అంటున్నారు. తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల నుంచి కూడా కొందరు నటీనటులను తీసుకోవాలని చూస్తున్నారట.

Exit mobile version