Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం.. లక్ష్మణుడిగా టాలీవుడ్ స్టార్.. రాముడు సీత ఎవరో తెలుసుగా..?

Bollywood Ramayan హనుమాన్ హిట్ తో రామాయణ మహా భారత కథా నేపథ్యంతో సినిమాలు చేయాలనే ఉత్సాహం ఎక్కువైంది. ఆల్రెడీ బాలీవుడ్ మేకర్ నితీష్ తివారి డైరెక్షన్ లో హిందీలో రామాయణ్ సినిమా

Published By: HashtagU Telugu Desk
Bollywood Ramayan Tollywood Hero As Lakshmana Ranbir As Rama And Sai Pallavi As Sitha

Bollywood Ramayan Tollywood Hero As Lakshmana Ranbir As Rama And Sai Pallavi As Sitha

Bollywood Ramayan హనుమాన్ హిట్ తో రామాయణ మహా భారత కథా నేపథ్యంతో సినిమాలు చేయాలనే ఉత్సాహం ఎక్కువైంది. ఆల్రెడీ బాలీవుడ్ మేకర్ నితీష్ తివారి డైరెక్షన్ లో హిందీలో రామాయణ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. కె.జి.ఎఫ్ యష్ రావణుడిగా నటించనున్నారు. బాలీవుడ్ రామాయణ్ సినిమాలో సౌత్ నటీనటులతో సినిమాపై సూపర్ బజ్ పెంచేస్తున్నారు. ఇక సినిమాలో కీలకమైన లక్ష్మణుడి పాత్రలో టాలీవుడ్ స్టార్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

రామాయణ సినిమాలో తెలుగు నటులను భాగం చేయాలనే ఉద్దేశంతో సినిమా కాస్టింగ్ లో వారికి అవకాశం ఇస్తున్నారట. అంతేకాదు సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా చేస్తుండగా లక్ష్మణుడిగా తెలుగు యువ హీరో నవీన్ పొలిశెట్టిని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. టాలీవుడ్ యువ హీరోల్లో తన టాలెంట్ తో సత్తా చాటుతున్న నవీన్ పొలిశెట్టి బాలీవుడ్ రామాయణంలో భాగం కానున్నాడు.

ఓ పక్క ఓం ప్రకాష్ కూడా బాలీవుడ్ లో మహా భారతం తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు. సూర్య అందులో లీడ్ రోల్ లో నటిస్తారని తెలుస్తుంది. మొత్తానికి రామాయణ, మహా భార్త కథలతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అయితే సౌత్ మేకర్స్ కూడా ఈ కథల మీద గురి పెట్టారు. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ గా మహా భారతం తీయాలని ఫిక్స్ చేసుకున్నాడు. మరి బాలీవుడ్ లో ఆల్రెడీ ఈ సినిమాలు వస్తున్నాయి కాబట్టి రాజమౌళి ప్రయత్నాన్ని విరమించుకుంటాడా లేదా అన్నది చూడాలి.

Also Read : Santhanam : ఆర్యకు నాకు అప్పులు ఉన్నాయి.. అందుకే మా ఇద్దరిని అడుగుతుంటారు..!

  Last Updated: 28 Jan 2024, 12:21 PM IST