Site icon HashtagU Telugu

Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం ముహూర్తం ఫిక్స్..!

Bollywood Ramayan Makers Planing To Start That Day

Bollywood Ramayan Makers Planing To Start That Day

Bollywood Ramayan హనుమాన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో బాలీవుడ్ లో తెరకెక్కించే రామాయణం మీద అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ మేకర్ నితీష్ తివారి తెరకెక్కించే రామాయణ సినిమాపై స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ఇలా భారీ తారాగణంతో ఆ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.

రామాయణ్ సినిమాను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తుంది. అంతేకాదు 2025 దీపావళికి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ రామాయణ మీద భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో బాబీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి స్టార్స్ కూడా సినిమాలో భాగం అవనున్నారట.

మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ఆడియన్స్ అందరినీ అలరించేలా ప్లాన్ చేస్తున్నారట. యానిమల్ లాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేసిన రణ్ బీర్ కపూర్ రాముడిగా చేయడం ఆడియన్స్ ని కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కె.జి.ఎఫ్ యష్ విలన్ గా నటించడం వల్ల సౌత్ లో కూడా సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడుతుంది. దంగల్ లాంటి మాస్టర్ పీస్ అందించిన నితీష్ రామాయణాన్ని ఎలా తెరకెక్కిస్తారా అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది.

Also Read : NTR : ఎన్.టి.ఆర్ తో ఆ ఇద్దరు.. ఫోటో అదిరిందిగా..!