Bollywood Bathukamma: బాలీవుడ్ మెచ్చిన బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి సల్మాన్, వెంకీ, పూజా ఫిదా!

తెలంగాణ అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే తెలంగాణ.. అందుకే బాలీవుడ్ సైతం బతుకమ్మకు పెద్ద పీట వేసింది.

  • Written By:
  • Updated On - March 31, 2023 / 01:20 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’ సినిమాతో ఈ ఈద్‌కు సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన పండుగకు మరో హిట్ కొట్టాలని గట్టిగా భావిస్తున్నాడు సల్మాన్ ఖాన్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నాలుగో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి బతుకమ్మ అనే నాల్గవ పాటను కొద్దిసేపటి క్రితమే ఆవిష్కరించారు. తెలంగాణ కల్చర్ ఎలివేట్ అయ్యేలా పూల పండుగను గొప్పగా చిత్రీకరించారు. బతుకమ్మ గొప్పతనాన్ని ప్రతిబింబజేసిన ఈ పాట తెలంగాణ ఆడబిడ్డలను ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ లో షేర్ చేసి కొనియాడారు.

జీ రహే ది హమ్ తర్వాత సల్మాన్ ఖాన్ బతుకమ్మ పాటను విడుదల చేశారు. తెలంగాణ పల్లె పదాలు, వేషాధారణ, పూల సోయగాలతో పాటు పంచెకట్టులో సల్మాన్ ఖాన్, వెంకటేశ్, చీరకట్టులో పూజాహెగ్గే అద్భుతంగా నటించి మరింత హైప్ ను క్రియేట్ చేశారు.  ఈ ఎనర్జిటిక్ సాంగ్‌లో పూజా హెగ్డే దాండియా స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్ సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయారు.

నివేదికల ప్రకారం.. వెంకటేష్ దక్షిణాదిలో పండుగ ప్రజాదరణ గురించి ప్రస్తావించినప్పుడు, సల్మాన్ వెంటనే ఓకే చెప్పాడు. గత ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని రియల్ లొకేషన్లలో 200 మంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లతో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. సుసంపన్నమైన తెలుగు సంస్కృతికి సల్మాన్‌ ఇచ్చే నివాళి ఇది. ఇక రాబోయే రోజుల్లో ఈ బతుకమ్మ పాట యూట్యూబ్ లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని సినిమా క్రిటిక్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో సర్కిల్ లో తెగ వైరల్ అవుతోంది.