Singer Pankaj Udhas Passed Away లెజెండరీ సింగర్ పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ (72) నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన మరణవార్తని పంకజ్ కూతురు నయాబ్ ఉదాస్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.
1951లో గుజరాత్ రాష్ట్రంలోని జెటూర్ లో జన్మించారు పంకజ్. చిన్నప్పుడే ముంబైకి ఆయన ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో అక్కడే చదువు పూర్తి చేశారు. పంకజ్ అన్నయ్య మన్ హర్ ఉదాస్ కూడా బాలీవుడ్ లో సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. మరో అన్న నిర్మల్ కూడా గజల్ గాయకుడిగా పేరు సంపాదించారు. అయితే ఇద్దరు అన్నయ్యల బాటలోనే పంకజ్ కూడా సింగర్ గా తన కెరీర్ కొనసాగించారు.
1970 లో వచ్చిన తుం హసీన్ మే జవాన్ సినిమాలో పంకజ్ తొలి పాట ఆలపించారు. 1986లో నాం అనే సినిమాలో పాడిన పాటకు పంకజ్ కు మంచి గుతింపు తెచ్చిపెట్టింది. బాలీవుడ్ సినీ పరిశ్రమలో 3 దశాబ్ధాలుగా తన గాత్రంతో అలరిస్తున్నారు పంకజ్. చిట్టి ఆయిహై ఆయుహై.. చాంది జైసా ఆంగ్ హై తేరా.. తోడి తోడి పియా కరో.. ఔర్ ఆహిస్తా కిజియే బాతే లాంటి ఎన్నో అద్భుతమైన సాంగ్స్ పాడారు పంకజ్. గజల్ సింగర్ గా సొంత మ్యూజిక్ ఆల్బంస్ తో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు పంకజ్.