Vikrant Massey : విదేశాల్లో ఉండే డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లాంటివి మన దేశంలోకి వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు అయితే అవి సాధారణం అయిపోయాయి. ముఖ్యంగా స్టార్స్, సెలబ్రిటీలు డేటింగ్, లివ్ ఇన్ చేస్తుండటం వాళ్ళని చూసి నార్మల్ జనాలు కూడా, ఫ్యాన్స్ కూడా అలవాటు చేసుకున్నారు. ప్రధాన నగరాల్లో అయితే చాలా మంది లివ్ ఇన్ లో ఉంటున్నారు.
అయితే తాజాగా దీనిపై ఓ బాలీవుడ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. గతంలో పలు సినిమాలతో మెప్పించిన నటుడు విక్రాంత్ మెస్సే 12th ఫెయిల్ సినిమాతో స్టార్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్రాంత్ మెస్సే మాట్లాడుతూ.. నేను సహజీవనం విధానాన్ని నమ్ముతాను. కానీ దీన్ని నేను ప్రచారం చేయను. దీని గురించి పబ్లిక్ గా మాట్లాడాలంటే భయమేస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్లి చాలా ఇంపార్టెంట్. పెళ్ళికి ముందు మన జీవితంలోకి వచ్చే వ్యక్తిని పూర్తిగా అర్ధం చేసుకోవడం ముఖ్యం. అందుకే సహజీవనం చెయ్యాలి, ఇది నా జీవితానికి అయితే ఉపయోగపడింది. అలాగని అందరి జీవితాల్లో అలా జరుగుతుందని చెప్పలేను. మనకు కాబోయే భాగస్వామితో కొన్నాళ్ళు ట్రావెల్ చేస్తే ఒకరిగురించి ఒకరికి తెలుస్తుంది, ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం మరింత బలపడతాయి. ఇవి జీవితాంతం కలిసి ఉండటానికి సహకరిస్తాయి అని అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ హీరో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
ఇక బాలీవుడ్ లో ఈ డేటింగ్, లివ్ ఇన్ కల్చర్ సర్వ సాధారణమే. ఒకరితో డేటింగ్ చేసి నచ్చకుంటే మళ్ళీ ఇంకో పార్ట్నర్ ని చూసుకుంటారు. పెళ్లి అయ్యాక కూడా విబేధాలు వస్తే విడిపోవడానికి రెడీ అవుతారు. అలాంటిది ఇప్పుడు విక్రాంత్ ఇలా సహజీవనం గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Surendar Reddy : పవన్ కళ్యాణ్ సినిమా పక్కన పెట్టేసి ఇంకో సినిమాకు రెడీ అవుతున్న డైరెక్టర్..