DSP: దేవి శ్రీ ప్రసాద్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. మ్యూజిక్ నచ్చలేదంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిశీలనక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 11:15 AM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిశీలనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరు. అంతేకాకుండా స్టార్ హీరోలు అందరికీ ఫస్ట్ ఛాయస్ దేవి శ్రీ ప్రసాద్ అని చెప్పవచ్చు.. కానీ ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ జోరు చాలా వరకు తగ్గిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ కి బదులుగా తమన్ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే తమన్ 10 నుంచి 15 సినిమాలు లైన్ అప్ చేస్తుంటే దేవిశ్రీప్రసాద్ మాత్రం రెండు మూడు సినిమాల దగ్గరే ఆగిపోతుండడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప సినిమా మంచి హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా విడుదల అయినా ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దాంతో పుష్ప సాంగ్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో దేవీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరో దేవీ శ్రీ ప్రసాద్ ను రిజక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. మరి ఆ స్టార్ హీరో మరెవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.

గతంలో సల్మాన్ నటించిన రెడీ సినిమాలో డింకచికా..డింకచికా అని రింగ రింగ సాంగ్ ను అలాగే రాధే సినిమాలో సీటీమార్ సాంగ్ ను వాడుకున్నాడు. ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి రెండు సాంగ్స్ చేయాలని అడిగగా అప్పుడు దేవీ చాలా ట్యూన్స్ వినిపించినప్పటికీ అవి ఏవీ సల్మాన్ ఖాన్ కు తృప్తి ఇవ్వలేక పోవడంతో సల్మాన్ ఖాన్ దేవీని పక్కన పెట్టమని చెప్పాడట. మేకర్స్ కూడా ఇదే మాటను దేవీ శ్రీ కి చెప్పేశారట. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు గురించి తెలియాల్సి ఉంది.