Malla Reddy : మల్లారెడ్డి వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫ్యాన్స్ ఆగ్రహం

బాలీవుడ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీ న‌టుల ముందే బాలీవుడ్ ని కించ‌ప‌రుస్తారా? ఇవేం వ్యాఖ్య‌లు..నలుగురు ఉన్న‌ప్పుడు ప‌బ్లిక్ లో ఇలా మాట్లాడుతారా?

Published By: HashtagU Telugu Desk
Mallareddy Bollywood

Mallareddy Bollywood

యానిమల్ ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల ఫై బాలీవుడ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా (Sandeep Vanga) తెరకెక్కించిన యానిమల్ ( (Animal)) మూవీ డిసెంబర్ 01 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసింది. తెలుగు ఆడియన్స్ సైతం ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్ లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుక కు ముఖ్య అతిధులుగా మహేష్ బాబు (Mahesh Babu) , రాజమౌళి (Rajamouli) , మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. రణబీర్ నీకు నేనొక విషయం చెప్తాను. అప్పట్లోనే నేను చెప్పాను.. బాలీవుడ్, హాలీవుడ్ ను.. తెలుగు హీరోలు రూల్ చేస్తారు అని.. మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు ఇప్పుడు సందీప్ వచ్చాడు. హాలీవుడ్, బాలీవుడ్ ను హిందుస్థానీ రూల్ చేస్తోంది. హైదరాబాద్ అందులో టాప్ మోస్ట్.. మా తెలుగు ప్రజలు చాలా స్మార్ట్. పుష్పతో అల్లు అర్జున్.. దుమ్మురేపాడు.. ఇప్పుడు సందీప్ మరోసారి బాలీవుడ్ లో దుమ్మురేపుతాడు. మ‌రో ఐదేళ్ల‌లో హిందుస్తాన్.. బాలీవుడ్..హాలీవుడ్ ని..తెలుగు ప్ర‌జ‌లు రూల్ చేస్తార‌ని.. ముంబై పాత‌దైపోతుంద‌ని..బెంగుళూరు ట్రాఫిక్ జామ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీ న‌టుల ముందే బాలీవుడ్ ని కించ‌ప‌రుస్తారా? ఇవేం వ్యాఖ్య‌లు..నలుగురు ఉన్న‌ప్పుడు ప‌బ్లిక్ లో ఇలా మాట్లాడుతారా? అదే వేదిక‌పై స‌ల్మాన్ ఖాన్ గ‌నుక ఉంటే మ‌ల్లారెడ్డి వ్యాఖ్య‌ల‌కు అప్పుడే కౌంట‌ర్ ప‌డిపోయేద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ లు పెడుతున్నారు.

Read Also : Hi Nanna : హాయ్ నాన్న నుండి ఐటెం సాంగ్ రిలీజ్

  Last Updated: 28 Nov 2023, 07:23 PM IST