Site icon HashtagU Telugu

Sr NTR : ఎన్టీఆర్ మేకప్ వేసుకున్నారని మొదటి రోజే సినిమా నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్..

Bollywood Cinematographer Ishaan Arya Leaves Sr NTR Movie on first day due to NTR Makeup

Bollywood Cinematographer Ishaan Arya Leaves Sr NTR Movie on first day due to NTR Makeup

నందమూరి తారక రామారావు(NTR) హీరోగా మద్రాసులోని సత్యం థియేటర్‌ అధినేతలు ఒక సాంఘిక చిత్రాన్ని మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్(Cinematographer) గా బాలీవుడ్(Bollywood) కెమెరా మెన్ ఇషాన్‌ ఆర్యని(Ishan Arya) తీసుకున్నారు. ఇక సినిమా షూటింగ్ మొదలు అయ్యింది. ఇషాన్‌ ఆర్య సీన్ కి తగ్గట్టు కెమెరాస్ అని సెట్ చేసుకున్నారు. ఇంతలో ఎన్టీఆర్ కూడా సెట్స్ కి చేరుకున్నారు. ఇంకేముంది షూటింగ్ మొదలైపోతుంది అనుకున్న సమయంలో నిర్మాతకు ఒక షాక్ తగిలింది. ఇషాన్‌ ఆర్య ఈ సినిమా నేను చేయలేనని అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇంతకీ అసలేమైంది..?

ఒక సినిమాకి మొదటి ప్రేక్షకుడు కెమెరా మెన్ అని అంటుంటారు. డైరెక్టర్ విజన్‌ని, యాక్టర్స్ యాక్టింగ్‌ని, అద్భుతమైన లొకేషన్స్‌ని.. ఇలా ప్రతి విషయానికి మొదటి జడ్జిమెంట్ ఇచ్చేది సినిమాటోగ్రాఫరే. ఇప్పుడంటే గ్రాఫిక్స్, హై స్టాండర్డ్ కెమెరాలు వచ్చి కొన్ని విషయాలు చూపించడానికి కెమెరా మెన్ కి సులువు అవుతుంది. కానీ అవేవి లేని సమయంలోనే అప్పటి సినిమాటోగ్రాఫర్స్ అద్భుతాలు సృష్టించారు. దీంతో ఆ సమయంలో కెమెరా మెన్స్ కి ఒక సీన్ చిత్రీకరించడం దర్శకుడితో సమానంగా కమాండ్ ఉండేది.

బాలీవుడ్ లో ‘గరమ్‌ హవా’ చిత్రంతో ఎంతో ఖ్యాతి తెచ్చుకున్న ఇషాన్‌ ఆర్య.. తెలుగులో బాపు, రమణల సినిమాలు ‘స్నేహం’, ‘ముత్యాలముగ్గు’కి కూడా ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఇక ఎన్టీఆర్ సినిమాకి తీసుకున్న తరువాత మొదటి రోజు సెట్స్ లో ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్ తన మేకప్ ని తానే వేసుకుంటారు. ముఖానికి దట్టమైన మేకప్, లిప్‌స్టిక్‌, విగ్గూ, కంప్లీట్ గెటప్ తో ఇంటి నుంచే బయలుదేరేవారు.

ఇక ఎన్టీఆర్ మేకప్ చూసిన ఇషాన్‌ ఆర్య.. ‘అదంతా తీసేయాలని కోరారు’. దానికి దర్శకనిర్మాతలు బదులిస్తూ.. “ఆయన అవి లేకుండా నటించారు” అని చెప్పుకొచ్చారు. ఇక వారి జవాబుకి ఇషాన్‌ ఆర్య సమాధానమిస్తూ.. “అయితే ఆయనకి అలవాటు అయిన కెమెరా మెన్ ని పెట్టుకోండి. నేను పని చేయలేను” అని చెప్పి సినిమా నుంచి తప్పుకున్నారట.

 

Also Read : Guntur Kaaram Censor Talk : సెన్సార్ పూర్తి చేసుకున్న గుంటూరు కారం