బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి. గంగూబాయి జీవితం ఆధారంగా రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా ఆమె జీవిత కథను సినిమాగా తీశారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలియా నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇది ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది.
ఈ ఏడాది ఆస్కార్‌కి భారతదేశం నుండి అధికారిక ప్రవేశం కోసం పోటీలో ఉన్న చిత్రాలలో ‘గంగూబాయి కతియావాడి’ ఒకటి అని బాలీవుడ్ టాక్. రెండు నెలల్లో ఆస్కార్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ‘గంగూబాయి కతియావాడి’ కూడా నామినేట్ కావచ్చునని తెలుస్తోంది. విదేశాల్లో కూడా ‘గంగుబాయి’ బిగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్‌కి ఎంపిక కావడం ఖాయమని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ‘గంగూబాయి కతియావాడి’తో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కూడా ఆస్కార్ రేసులో ఉన్నాయి.