Site icon HashtagU Telugu

Urvashi Rautela: గొప్ప మనసు చాటుకున్న బాలయ్య బాబు హీరోయిన్.. పొగడ్తల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్!

Urvashi Rautela

Urvashi Rautela

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమా విడుదల అయిందా కానీ అప్పటి నుంచి ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో పాటు దబిడి దిబిడి సాంగ్‌ తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా భారీగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగింది.

దాంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ ఊర్వశి చేసిన పనికి అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా తన గొప్ప మనసును చాటుకుంది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. ఏకంగా 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు.

 

అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించి మంచి మనసుని చాటుకుంది. అయితే ఇందుకు సంబందించిన ఫొటోస్ వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వరల్డ్ కావడంతో అభిమానులు ఊర్వశి పై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. నిజంగా ఊర్వశి గారు చాలా గ్రేట్ అంత మందికి పెళ్లి జరిపించడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రియల్ లైఫ్ లో హీరోయిన్ అంటే మీరే అంటూ ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు.