Site icon HashtagU Telugu

Urfi Javed: విశ్వం మొత్తాన్ని తన డ్రెస్ లో చూపిస్తున్న ఉర్ఫీ.. ఏమి డ్రెస్ రా బాబు?

Mixcollage 19 Mar 2024 10 27 Pm 2670

Mixcollage 19 Mar 2024 10 27 Pm 2670

బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉర్ఫీ జావేద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన వేషధారణ. చిత్ర విచిత్రమైన వేషధారణతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ ని కూడా ఉంటుంది. కాగా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకు ఈమె బాగా సుపరిచితమే. ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని విధాలుగా ట్రోల్స్ చేసినా కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఉర్ఫీ జావెద్ ఎప్పటిలాగే తన విచిత్రమైన వేషధారణతో మరొకసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఏకంగా తన డ్రెస్సులో విశ్వం మొత్తాన్ని చూపించేసింది. డ్రెస్ లో విశ్వ మొత్తాన్ని చూపించడం ఏంటి అనుకుంటున్నారా.. అవునండోయ్.. సూర్యుడు చుట్టూ తిరిగి తొమ్మిది గ్రహాలను తన చుట్టూ తిప్పుకుంటూ ఉర్ఫీ ఆ డ్రెస్సుని రెడీ చేయించారు. ఇక ఈ డ్రెస్ ధరించి ముంబై వీధుల్లోకి వచ్చిన ఉర్ఫీని చూసిన ప్రజలంతా వావ్ ఫీల్ అయ్యారు. ఈ డ్రెస్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్,ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

ఇక ఈ వీడియో నెటిజెన్స్ సరదా కామెంట్స్ చేస్తున్నారు. సైన్స్ ఎగ్జిబిషన్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిన్ ఉన్నప్పుడు ఈ డ్రెస్ బాగా అవసరం పడుతుంది. ఉర్ఫీ తన డ్రెస్సింగ్ స్టైల్ తో మనల్ని షాక్ చేయడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. చూడడానికి అదొక గంపలాగా ఉంది. ఆ డ్రెస్ లో ఉర్ఫీ బుట్ట బొమ్మలా కనిపిస్తోంది.

Exit mobile version