Site icon HashtagU Telugu

Sushmita Sen : 48 ఏళ్ళ వయసులో డేట్ ఆఫ్ బర్త్ మార్చిన హీరోయిన్.. ఎందుకని?

Bollywood Actress Sushmita Sen Changer Her Date of Birth news goes Viral

Susmitha Sen

Sushmita Sen : సాధారణంగా ఏ మనిషికి అయినా ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మనం పుట్టిన తేదీ, సంవత్సరాన్ని మార్చలేము. కానీ ఈ బాలీవుడ్ హీరోయిన్ తాజాగా తన బర్త్ డేట్ మార్చుకుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్, మాజీ మిస్ యూనివర్స్ సుస్మిత సేన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. పలు టీవీ షోలలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ అలరిస్తుంది.

సుస్మిత సేన్ పుట్టినరోజు 19 నవంబర్ 1975. అంటే ఇప్పుడు ఆమెకు ఆల్మోస్ట్ 48 ఏళ్ళు. కానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తన పుట్టిన రోజు డేట్ ని 27-02-2023 కు మార్చుకుంది. కాకపోతే దానిముందు సెకండ్ బర్త్ అని పెట్టుకుంది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

అయితే సుస్మిత సేన్ ఇటీవల ఫిబ్రవరిలో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరింది. ఆ సమయంలో అందరూ కంగారు పడ్డారు. కానీ చికిత్స్ తీసుకొని కోలుకొని బయటకు వచ్చింది. దీంతో ఆ హార్ట్ అటాక్ నుంచి బయట పడ్డాక ఇది తన సెకండ్ లైఫ్ అని ఫీల్ అవుతూ సుస్మిత సేన్ తన బర్త్ డేట్ ని అలా మార్చుకుందని తెలుస్తుంది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఈ విషయంలో ఆమెని అభినందిస్తున్నారు.

 

Also Read : Pawan Kalyan : రేపే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన.. షెడ్యూల్ ఇదే..