Sonali Bendre : ముంబై భామ సోనాలి బెంద్రే మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టారు. 19 ఏళ్ళ వయసులో బాలీవుడ్ మూవీతో తన కెరీర్ ని స్టార్ట్ చేసారు. ఇక ఆ తరువాత తన ప్రతిభతో తెలుగు, తమిళంలో కూడా వరుస అవకాశాలు అందుకొని సూపర్ హిట్స్ అందుకున్నారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సోనాలి పెళ్లి చేసుకొని యాక్టింగ్ కి దూరమయ్యారు. అప్పటి నుంచి ఫ్యామిలీ లీడ్ చేస్తూ వచ్చిన సోనాలి.. 2005లో ఒక బాబుకి జన్మనిచ్చి తల్లి అయ్యారు.
ఇప్పుడు ఆ బాబు హీరో మెటీరియల్ గా మారాడు. నిన్న అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీస్ హాజరయ్యిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోనాలి కూడా తన భర్త మరియు కొడుకుతో కలిసి వివాహానికి వచ్చారు. సోనాలి కొడుకు పేరు రణ్‌వీర్ భేల్. ప్రస్తుతం ఇతడి వయసు 19 ఏళ్ళు. ఇక రణ్‌వీర్ చూడడానికి.. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తక్కువుగా అనిపించడంలేదు. దాదాపు ఆరడుగుల ఎత్తుతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. మరి సోనాలి తన వారసుడిని ఇండస్ట్రీలోకి తీసుకు వస్తారా..? లేదా..? చూడాలి.
#SonaliBindre with family at the Red Carpet of #AnanthRadhikaWedding #AmbaniWedding pic.twitter.com/nu3hZB9bea
— Gulte (@GulteOfficial) July 12, 2024
ఇక సోనాలి సినిమా కెరీర్ విషయానికి వస్తే.. 2004 తరువాత దాదాపు 9 ఏళ్ళు సినిమాల్లో కనిపించలేదు. 2013, 2022లో ఒక్కో సినిమాలో ముఖ్య పాత్ర చేసి ఆడియన్స్ ని పలకరించారు. సోనాలి హీరోయిన్ గా రాణించిన సమయంలో విజయ శాతమే ఎక్కువ ఉంది. ముఖ్యంగా తెలుగులో నటించిన సినిమాలు అయితే ఒక్క సినిమా తప్ప అన్ని విజయాలే సాధించాయి. ఇక విజయాలు సాధించిన మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మధుడు, శంకర్ దాదా.. క్లాసిక్ చిత్రాలుగా నిలిచిపోయాయి.