RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో కూడా ఫుల్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం దేవర(Devara) సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు బాలీవుడ్ లో వార్ 2(War 2) సినిమా కూడా చేస్తున్నాడు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్, జాన్ అబ్రహం ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ ఓ హీరోయిన్ గా నటించబోతుందని ఇప్పటికే సమాచారం.
వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ అని టాక్ నడుస్తుంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ఇటీవలే ఓ షెడ్యూల్ షూట్ పూర్తిచేశారు కూడా. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శార్వరి వాఘ్ అనే భామ నటించబోతున్నట్టు సమాచారం.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి హీరోయిన్ గా మారింది శార్వరి. ఇటీవల బంటి ఔర్ బబ్లూ సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. మరో రెండు సినిమాలు చేయబోతుంది. తాజాగా YRF సంస్థ ఈ అమ్మడికి పిలిచి ఛాన్స్ ఇచ్చినట్టు, వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ సరసన శార్వరి చేయబోతున్నట్టు బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read : Varalaxmi Sarathkumar : మొదటిసారి సినిమా కోసం ఆ పనిచేశాను.. చాలా ఇబ్బంది పడ్డాను..