Israel – Bollywood Actress : ఇజ్రాయెల్ లో బాలీవుడ్ నటి మిస్సింగ్ ?

Israel - Bollywood Actress : ఇజ్రాయెల్‌ నుంచి ఇండియాకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Israel Bollywood Actress

Israel Bollywood Actress

Israel – Bollywood Actress : ఇజ్రాయెల్‌ నుంచి ఇండియాకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ నటి నుస్రత్ బరూచా అక్కడ  చిక్కుకుపోయారని తెలిసింది. ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ దాడులు జరుగుతుండటంతో ఆమె ఇజ్రాయెల్ లోని ఓ చోట ఉండిపోయారని సమాచారం అందుతోంది. ఆమె టీమ్ సభ్యులు ఈవివరాలను వెల్లడించారు.  ఇజ్రాయెల్ లో జరుగుతున్న హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె వెళ్లారని తెలిపారు. ఇజ్రాయెల్ లోని ఓ చోట అండర్ గ్రౌండ్ లో నుస్రత్ బరూచా సేఫ్ గా ఉన్నారని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

అయితే చివరిసారిగా శనివారం మధ్యాహ్నం  12.30 గంటలకు ఆమెతో ఫోన్ లో మాట్లాడామని.. ఇప్పుడు ఫోన్ కనెక్ట్ కావడం లేదని నుస్రత్ టీమ్ సభ్యులు చెబుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. నుస్రత్ ను సురక్షితంగా భారత్ కు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. హమాస్ దాడిని ఖండించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా ఉంటామని (Israel – Bollywood Actress)  ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also read : South Africa Beat Sri Lanka: వన్డే ప్రపంచకప్‌ లో రికార్డు.. ఒకే మ్యాచ్ లో 754 పరుగులు, 49 బంతుల్లోనే సెంచరీ..!

  Last Updated: 08 Oct 2023, 07:35 AM IST