Site icon HashtagU Telugu

Bollywood Transgender: ట్రాన్స్ జెండర్ గా మారిన బాలీవుడ్ నటుడు.. ఫొటో వైరల్!

nawazuddin transgender

nawazuddin transgender

బాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోముందుంటాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆయన పాత్రలో నటించినా.. ఆ పాత్రకు వన్నె తీసుకొస్తారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెకుతున్న చిత్రం ‘హడ్డీ’. ఈ సినిమాలో సిద్ధిఖీ ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించనున్నారు. దీని కోసం ఆయన దాదాపు మూడు గంటల పాటు మేకప్ కోసం కేటాయించాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నటుడు ఎవరబ్బా.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జీ స్టూడియోస్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ట్రాన్స్ జెండర్‌ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని వెల్లడించింది. ఈ సినిమాకు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023లో జీ స్టూడియోస్‌లో విడుదల కానుంది.