Site icon HashtagU Telugu

Sanjay Dutt Injured: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు గాయం, అయినా శరవేగంగా షూటింగ్

Sanjay Dutt

Sanjay Dutt

బహుముఖ పాత్రలకు కేరాఫ్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రస్తుతం అటు తెలుగు, ఇటు హిందీలో ఈ నటుడుకి ఫుల్ డిమాండ్ ఉంది. భారీ బడ్జెట్ చిత్రాల కారణంగా నిరవధికంగా షూటింగ్స్ చేస్తున్నాడు. విజయ్, త్రిష నటించిన ‘లియో,’ అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి నటించిన ‘వెల్ కమ్ 3,’ బినోయ్ గాంధీ దర్శకత్వం వహించిన ‘ఘుడచాడి,’ రామ్ పోతినేని నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే గత వారం బ్యాంకాక్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం కత్తి యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు దత్‌కు చిన్న గాయమైంది.

ప్రమాదం జరిగినప్పటికీ, తలపై కొన్ని కుట్లు వేసిన కొద్దిసేపటికే సెట్‌కి తిరిగి వచ్చాడు. దత్ అంకితభావం, వృత్తి నైపుణ్యం ప్రశంసనీయం. గత వారం బ్యాంకాక్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రీకరణలో సంజయ్ దత్ గాయపడ్డాడు, ”అతను కత్తి యుద్ధంతో కూడిన పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రీకరిస్తున్నాడు. ఆ క్షణంలో గాయపడ్డాడు. అతని తలపై రెండు కుట్లు పడ్డాయి. కానీ సంజయ్ ప్రొఫెషనల్ కాబట్టి వెంటనే సెట్‌పైకి వెళ్లి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు’’ అని మేకర్స్ తెలిపారు.

సంజయ్ దత్ తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ మరియు త్రిషతో కలిసి పని చేసే ప్రాజెక్ట్ ‘లియో’తో తమిళ సినిమాలో తన అరంగేట్రం చేయబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దత్ కెరీర్‌లో మరో మైలురాయి. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘డబుల్ ఇస్మార్ట్’ దత్ కీలక పాత్ర చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ మూవీలోనూ ఈ నటుడు కీలక పాత్ర చేస్తున్నట్టు సమాచారం.

Also Read: CM KCR: త్వరలోనే కొత్త పీఆర్సీ తో ఉద్యోగుల వేతనాలు పెంచుతాం: సీఎం కేసీఆర్