Site icon HashtagU Telugu

Anil Kapoor Request to Rishab Shetty: కాంతారా క్రేజ్.. ఛాన్స్ ప్లీజ్ అంటున్న అనిల్ కపూర్!

Anil Kapoor Request to Rishab Shetty, kantara

Anil Kapoor

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపింది కాంతార (Kantara) మూవీ. సెప్టెంబర్ 2022లో థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ భారీ కలెక్షన్లు సాధించింది. రిషబ్ శెట్టి (Rishab Shetty) రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కంటెంట్ ఈజ్ కింగ్’ మరోసారి అని నిరూపించింది. ఇక మూవీ పలు టాలీవుడ్, బాలీవుడ్ రికార్డులను సైతొ కొల్లగొట్టింది. కాంతార భారీ విజయ సాధించిన తర్వాత, ప్రముఖ హీరో హీరోయిన్లు తమ అభిమానం చాటుకున్నారు. తాజాగా సీనియర్ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) సైతం ఫిదా అయ్యాడు. ఇక అనిల్ కపూర్ రిషబ్ శెట్టితో కలిసి పనిచేయాలని బలంగా కోరుకుంటున్నాడు.

అనిల్ కపూర్ (Anil Kapoor) పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్‌పై ప్రశంసలు కురిపించడమే కాకుండా రిషభ్ శెట్టితో సరాదాగా మాట్లాడారు. ప్రతిభావంతులైన చిత్రనిర్మాత అయిన రిషశ్ శెట్టితో కలిసి పని చేయాలనే తన కోరికను కూడా వ్యక్తం చేశారు. అయితే రిషబ్ శెట్టి తన సినిమాల కోసం నెలల తరబడి రిహార్సల్స్‌ను ఎలా నిర్వహిస్తాడో వెల్లడించాడు. తన చిత్రాల్లో ఎక్కువగా కొత్తవారిని నటించడానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. అయితే, ఈ ఆలోచనతో పూర్తిగా ఆకర్షితుడైన అనిల్ కపూర్, రిషబ్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. “మీ తదుపరి చిత్రంలో నన్ను తీసుకోండి. నేను ఇంతకు ముందు ఒక కన్నడ చిత్రం (మణిరత్నం పల్లవి అనుపల్లవి) చేసాను” అని అనిల్ కపూర్ (Anil Kapoor) అన్నారు.

యాక్షన్ థ్రిల్లర్, కర్నాటక తీర ప్రాంతాల్లో జరిగే ఆచార ప్రదర్శన ‘దైవ కోలా’ చుట్టూ తిరుగుతుంది, ఇది 2022లో విడుదలయ్యే అత్యుత్తమ భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.  ఈ చిత్రంలో (Kantara) రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడు. సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి మరియు ఇతరులతో సహా స్టార్ తారాగణం ఉంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన కాంతారా త్వరలో సీక్వెల్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Raashi Khanna Likes Vijay: విజయ్ దేవరకొండపై మనసు పారేసుకున్న రాశీకన్నా!