Bikini Actress: బికినీతో బోల్డ్ షో.. భారీ ఫాలోయింగ్ తో కోట్లు కొల్లగొడుతున్న బ్యూటీలు!

జాన్వీ కపూర్, దిశా పటానీ, శిల్పాశెట్టి లాంటి హీరోయిన్స్ కేవలం సోషల్ మీడియా ద్వారా కోట్లు కొల్లగొడుతున్నారు. 

  • Written By:
  • Updated On - August 3, 2023 / 11:43 AM IST

దశాబ్దం క్రితమే భారతీయ సినిమాలో హీరోయిన్ బికినీలో కనిపించడం అనేది అరుదైన విషయం.  ఒక ప్రముఖ నటి బికినీ సీన్ చేయాలని నిర్ణయించుకుంటే ఒకప్పుడు వార్తల్లోకి ఎక్కేది. ఐదేళ్ల క్రితం కూడా ఓ హీరోయిన్ బికినీలో కనిపించడం అంటేనే ఎక్కువ డిమాండ్ వచ్చి చర్చనీయాంశమైంది. ఐశ్వర్యరాయ్ నటించిన ధూమ్-2, కరీనా కపూర్‌తో కంబఖ్త్ ఇష్క్, కత్రినా కైఫ్‌తో మల్లీశ్వరి, ప్రియమణితో ద్రోణ వంటి సినిమాలు బికినీలు వేసుకొని అందర్నీ అట్రాక్ట్ చేశారు. దీంతో హీరోయిన్స్ కు పారితోషికం భాగానే లభించింది. నటనకు ఒక ధర ఉందని, బికినీ ధరించడానికి మరో ధర ఉండేది అప్పట్లో.

బికినీ సన్నివేశాలు ఒకప్పుడు సినిమాల్లో రెచ్చిపోయే అందాలు ప్రదర్శనకు ప్రతీక. అయితే, ఈరోజుల్లో హీరోయిన్లు బికినీలు వేసుకోవడంలో చాలా కంఫర్టబుల్‌గా ఉంటున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది నటీమణులు అప్రయత్నంగా బికినీలు వేసుకోవడం సహజంగా మారింది. ప్రస్తుత హీరోయిన్లు తమ సోషల్ మీడియా ఖాతాలలో పెద్దగా హంగామా లేకుండా బికినీ ధరించిన లుక్‌లను ఫ్రీగా ప్రదర్శిస్తున్నారు. ఇకపై బికినీ ధరించడం ఖరీదైన  ప్రత్యేకమైన వ్యవహారం కాదు.

నటీమణులు తమ సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచుకోవడం. మార్కెటింగ్‌లో పెట్టుబడి పెట్టడం ఈ మార్పుకు ఒక కారణం. కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, అలియా భట్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, ఇలియానా, సారా అలీ ఖాన్, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖ నటీమణులు ఎక్కువ మంది ఫాలోవర్లను పొందేందుకు, పాపులారిటీ పెంచుకోవడానికి బికినిలకు సూ అంటున్నారు. జాన్వీ కపూర్, దిశా పటానీ, శిల్పాశెట్టి లాంటి హీరోయిన్స్ కేవలం సోషల్ మీడియా ద్వారా కోట్లు కొల్లగొడుతున్నారు. పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

Also Read: KTR: రైతు రుణమాఫీ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు