Site icon HashtagU Telugu

Ghantasala last wish: ఘంటసాల చివరి కోరికను నెరవేర్చబోయి..!

Ghantasala Last Wish

Ghantasala Last Wish

ఘంటసాలకి (Ghantasala) ఇద్దరు భార్యలు అని చాలా తక్కువ మందికి తెలుసు. ఒకరు సావిత్రమ్మ అయితే, మరొకరు సరళ. ఘంటసాల – సరళ వివాహాన్ని సావిత్రమ్మ దగ్గరుండి జరిపించడం విశేషం. ఘంటసాల వలన సరళకి కలిగిన సంతానమే రవి కుమార్. ఘంటసాల (Ghantasala) పోలికలు ఎక్కువగా కనిపించేది ఆయనలోనే.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ” కైలాసగిరి దర్శనం .. మానస సరోవర యాత్ర చేయాలనేది మా నాన్నగారి కోరిక. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. అందువలన ఆయన కోరికను నెరవేర్చడం కోసం మా అమ్మగారు ఒక బృందంతో కలిసి మానస సరోవర యాత్రకి వెళ్లారు.

“ఆమె కైలాసగిరి దర్శనం చేసుకున్నారు .. మానస సరోవరం చూశారు. ఆ తరువాత తన కోరిక నెరవేరిందని చెప్పేసి అక్కడి నుంచి మాకు కాల్ చేసి చెప్పారు. ఆ సమయంలో ఆమె చాలా ఆనందంగా మాట్లాడారు. ఆ తరువాత అక్కడే వున్న టెంట్ లో ఆమె ప్రాణాలు వదిలారు. అలా అమ్మగారు శివ సాయుజ్యాన్ని పొందారు” అన్ని చెప్పుకొచ్చిన ఘంటసాల తనయుడు.

Also Read:  Nayanthara: చెన్నైలో నయనతార, విఘ్నేష్ శివన్ ఇంటికి ఓ ముఖ్య అతిథి..!