ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవా నిరతిని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బాబీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆయనలోని సేవా గుణాన్ని కొనియాడారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా చాలామంది సాగుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల కోసం తనకున్న సుఖాలను, సినిమా గ్లామర్‌ను, కోట్లాది రూపాయల సంపాదనను వదులుకున్నారని బాబీ పేర్కొన్నారు. పవన్‌ను ఒక ‘ఋషి’ గా అభివర్ణిస్తూ, ఆయన నిస్వార్థ రాజకీయ ప్రస్థానం ఎందరికో ఆదర్శమని బాబీ తన ట్వీట్‌లో భావోద్వేగంగా రాసుకొచ్చారు.
బుద్ధుడితో పోలిక
చరిత్రలో మనం జ్ఞానోదయం కోసం అడవికి వెళ్ళిన సిద్ధార్థుడిని (గౌతమ బుద్ధుడు) గురించి చదువుకున్నామని, కానీ నేడు ప్రజల కష్టాలను తీర్చడం కోసం, వారిలో వెలుగులు నింపడం కోసం నిరంతరం తపించే వ్యక్తిని పవన్ రూపంలో చూస్తున్నామని బాబీ అన్నారు. ఒకప్పుడు వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలిగిన పవన్, నేడు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న తీరు అసాధారణమని ఆయన అభిప్రాయపడ్డారు. పదవుల కోసం కాకుండా, ప్రజా క్షేమమే పరమావధిగా భావించే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తనను ఎంతో ప్రభావితం చేసిందని దర్శకుడు వెల్లడించారు.
నిరంతర శ్రామికుడు ఈ తరం కర్మయోగి
పవన్ కళ్యాణ్‌ను ‘కర్మయోగి’ గా బాబీ అభివర్ణించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫలితం ఆశించకుండా తన ధర్మాన్ని నిర్వర్తించేవాడే కర్మయోగి అన్న గీతా వచనాన్ని పవన్ నిజం చేస్తున్నారని బాబీ పేర్కొన్నారు. పవన్ తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి, సమాజ మార్పు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. “ఆయనను ఇవాళ కళ్లారా చూశాక, ఒక గొప్ప సంకల్పం ఉన్న మనిషి ఎలా ఉంటారో అర్థమైంది” అని బాబీ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరియు రాజకీయ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప ఆలోచన విధానం అని బాబీ తన కథనంలో స్పష్టం చేశారు.
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం…
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు…ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు…
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న… pic.twitter.com/pt79dmsRNf— Bobby (@dirbobby) April 8, 2026
