Site icon HashtagU Telugu

Harihara Veeramallu: పవన్ చిత్రంపై బాబీ డియోల్ సంచలన కామెంట్స్

harihara veeramallu

harihara veeramallu

Harihara Veeramallu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సినిమాల నుంచి వచ్చే రెమ్యునరేషన్ ద్వారా పార్టీని నడిపించవచ్చనే అభిప్రాయంతో సినిమాలు చేస్తున్నారు. కానీ రాజకీయల కారణంగా సినిమాలకు బ్రేక్ పడుతుంది. మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నాడు. అయితే పవన్ నటించే చిత్రాల్లో హరిహర వీరమల్లు సినిమాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజమని తేలింది. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న యానిమల్ సినిమాలో కూడా బాబీ విలన్ గా నటించాడు. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన బాబీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను ఓ తెలుగు చిత్రాన్ని అంగీకరించానని, అయితే సగం షూటింగ్ పూర్తికావడంతో అది ఆగిపోయిందని చెప్పారు. హరిహర వీరమల్లు సినిమా అని బాబీ ఒప్పుకోవడంతో దాదాపు ఆగిపోయిందని అంటున్నారు. మరి దీనిపై దర్శకుడు క్రిష్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Also Read: Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్.. సేఫ్​గా బయటికొచ్చిన 41 మంది కూలీలు..!