బాలీవుడ్ ఒకప్పటి నటుడు హీరో బాబీ డియోల్ (Bobby Deol) కి మళ్లీ మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమాలో రణ్ బీర్ ని ఢీ కొట్టి విలన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు బాబీ డియోల్. యానిమల్ తర్వాత అతని సినిమాల లిస్ట్ పెరుగుతుంది. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వస్తుండగా సౌత్ లో కూడా అందరు బాబీనే కావాలని కోరుతున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఇప్పటికే సూర్య కంగువ సినిమాలో బాబీ నటిస్తున్నాడని తెలిసిందే. రీసెంట్ గా సినిమా నుంచి బాబీ డియోల్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాతో పాటుగా హరి హర వీరమల్లు సినిమాలో కూడా బాబీ డియోల్ నటిస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా బాబీ డియోల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈమధ్యనే ఆయన ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇదే కాదు మరికొన్ని ఆఫర్లు కూడా బాబీ లైన్ లో ఉన్నాయట. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ కెరీర్ ఊపందుకోవడంతో బాబీ డియో మంచి జోష్ లో ఉన్నారు. సౌత్ సినిమాలతో షేక్ చేయాలని చూస్తున్న బాబీ ఇక్కడ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటారన్నది చూడాలి.
Also Read : Venkatesh : వెంకటేష్ తో మరోసారి అలాంటి అటెంప్ట్.. బడా ప్రొడ్యూసర్ ప్లాన్ అదుర్స్..!