Site icon HashtagU Telugu

Megastar Chiranjeevi: రక్తదాతలే నిజమైన దేవుళ్లు: మెగాస్టార్ చిరంజీవి ట్వీట్!

Blood Donation

Blood Donation

జీవితాల్ని కాపాడటానికి, మానవత్వాన్ని చాటడానికి సులువైన మార్గం రక్తదానం అని ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ట్విటర్‌ (Twitter) వేదికగా ఆయన ఈ ఫొటోను పంచుకున్నారు. రక్తదాతలే నిజమైన దేవుళ్లు అని తెలిపారు. ఏదైనా ప్రమాద సమయంలో క్షతగాత్రులకు, బాధితులకు రక్తం అందించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను చూసి చలించిపోయిన మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ ను స్థాపించాడు.

‘చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తం (Blood) పేదలకు 70శాతం ఉచితంగా అందుతోంది. మిగతా రక్తాన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య తక్కువగా ఉంది. ఇటీవల 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించింది. కరోనా సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్  (Blood Bank) ద్వారా ఎంతోమంది రక్తం పొందారు.

1998లో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారనే విషయాన్ని చెప్పారు. అలాంటి ఘటనలు ఎంతగానో బాధించాయన్నారు. తన అభిమానుల ప్రేమ నలుగురికి పంచాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించినట్టుగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ప్రతిఒక్కరూ సమాజహితం కోసం రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: Amit Shah Tour: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. టెన్షన్ లో బీజేపీ శ్రేణులు?