Site icon HashtagU Telugu

Sankranthiki Vasthunnam : పొంగల్ సాంగ్ ప్రొమో వచ్చేసింది

Pongal Promo

Pongal Promo

విక్టరీ వెంకటేశ్ లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి పొంగల్ సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ నెల 30న ఫుల్ సాంగ్ను రిలీజ్ చేయనుంది. విక్టరీ వెంకటేష్ (Venkatesh) అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సినిమా టైటిల్ లోనే సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టి సంక్రాంతి రేసులో దిగుతున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో ఏ ఒక్క విషయాన్ని వదలట్లేదు మేకర్స్. ముఖ్యంగా Sankranthiki Vastunnam సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో అనీల్ రావిపుడి మార్క్ చూపిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా 3వ సాంగ్ పై మరింత హైప్ పెంచారు.

ఈ సాంగ్ ని వెంకటేష్ తో పాడించారు. దాని గురించి అప్డేట్ ఇస్తూ వెంకటేష్ నేను పాడతా అంటూ డైరెక్టర్ అనీల్ (Anil Ravipudi,) వెంట పడుతున్నట్లు ప్రమోషన్ చేసి సాంగ్ పై ఎక్కడలేని బజ్ తీసుకొచ్చాడు. ఫైనల్ గా ఆ సాంగ్ తాలూకా ప్రోమో ను శనివారం విడుదల చేసారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను వెంకీ, భీమ్స్, రోహిణి పాడారు. ఫుల్ సాంగ్ ను ఈ నెల 30 న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి ఎప్పుడు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కూడా అలాగే హిట్ కొట్టబోతున్నట్లు సినిమా తాలూకా సాంగ్స్ , ప్రమోషన్స్ చూస్తే అర్ధం అవుతుంది. గతంలో వెంకీ తో F2 , F3 తో వచ్చి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వెంకీ ఫ్యాన్స్ ధీమా గా ఉన్నారు.

Read Also : Mega Fan -‘RIP Letter’ : ఆత్మహత్య చేసుకుంటా అంటూ మెగా అభిమాని లేఖ..ఎందుకంటే..!!