Block Buster Talk for Allu Arjun Pushpa 2 అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా పుష్ప 2. నేడు వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు బుధవారం రాత్రి ప్రీమియర్స్ వేశారు. ఈ ప్రీమియర్స్ నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిని. ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం దుమ్ము దులిపేసింది. సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్, జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఇవన్నీ ప్రధాన హైలెట్స్ గా చెబుతున్నారు.
పుష్ప 2 (Pushpa 2) సినిమా కు అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ టాక్ ( Pushpa 2 Blockbuster Talk) వచ్చింది. సుకుమార్ మీద అల్లు ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్స్ అనిపించేలా ఉండగా రష్మిక (Rashmika) యాక్టింగ్, గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవన్నీ కూడా సినిమాకు హైలెట్స్ గా నిలిచాయని తెలుస్తుంది.
ముందు నుంచి సూపర్ బజ్..
పుష్ప 2 పై ముందు నుంచి సూపర్ బజ్ ఉండగా సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ కూడా ఒక రేంజ్ బజ్ ఏర్పడింది. ఇక సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాగా కలెక్షన్స్ మోత మోగించడం ఖాయమని తెలుస్తుంది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఐతే సినిమా పక్కా ఫుల్ మీల్స్ అందించేలా ఉందని తెలుస్తుంది. సుకుమార్ 3 ఏళ్లు టైం తీసుకున్నా కూడా అంచనాలను మించి సినిమా ఇచ్చాడని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 తొక్కిసలాట.. ఒకరు మృతి..!